బయటకు వెళ్లినప్పుడు ఏదో ఒక సందర్భంలో తప్పకుండా పబ్లిక్ టాయిలెట్స్ వాడుతుంటారు. సాధారణంగా పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రంగా లేకపోయిన తప్పక యూజ్ చేస్తారు. అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్స్‌ను వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయి. పబ్లిక్ ప్రదేశాల్లో టాయిలెట్స్ ఉపయోగించినప్పుడు.. టిష్యూ తప్పకుండా వాడాలి. దీనితో టాయిలెట్ సీట్‌ను క్లీన్ చేసుకున్న తర్వాత యూజ్ చేయాలి. వీలైతే టాయిలెట్ శానిటైజర్లను బయటకు వెళ్లేటప్పుడు క్యారీ చేస్తుండాలి.
టాయిలెట్స్‌లో పెట్టవద్దు..
హ్యాండ్ బ్యాగ్, మొబైల్ ఫోన్ వాడుతూ.. ఎక్కువ సేపు ఉండకూడదు. బాత్‌రూమ్‌లో ఉన్న బ్యాక్టీరియా మొబైల్స్‌కి అంటుకుంటుంది. దీంతో మీరు ఎన్నిసార్లు చేతులు శుభ్రం చేసుకున్న బ్యాక్టీరియా ఉంటుంది. శుభ్రం చేసుకున్న తర్వాత చేతులు ఆరబెట్డడానికి హ్యాండ్ డ్రయర్స్ ఉంటాయి. వీటిని అయితే అసలు ఉపయోగించకూడదు. ఇందులో బ్యాక్టీరియా, క్రిములు అధికంగా ఉంటాయి. వీటితో మీరు ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర ఉండే గోడలు తాకడం, ఆ ప్రదేశాల్లో వస్తువులు పెట్టడం వంటివి చేయకూడదు.