Ugadi 2025: ఈ రోజే షడ్రురుచులు ఎందుకు తినాలి.. ప్రత్యేకతలు ఇవే

ఉగాది పండుగ రోజు షడ్రురుచుల పచ్చడిని తప్పకుండా తినాలని పండితులు చెబుతున్నారు. అయితే షడ్రురుచుల పచ్చడి ఈ రోజే ఎందుకు తినాలి? దీని ప్రత్యేకతలు ఏంటి? ఇవి వేటి అర్థాలను సూచిస్తుందో తెలుసుకోవాలంటే మొత్తం ఆర్టికల్ చదివేయండి.

New Update
Ugadi Festival 2025

Ugadi Festival 2025

ఉగాది పండుగ అంటే షడ్రురుచుల పచ్చడి తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు, వేపపువ్వుతో కలిపి తప్పనిసరిగా ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. అసలు ఉగాది రోజు ఎందుకు తప్పకుండా పచ్చడి తినాలి? దీని ప్రత్యేకతలు ఏంటో తెలియాలంటే ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి. 

తీపి

షడ్రురుచుల్లో బెల్లం కూడా ఒక భాగం. ఉగాది పచ్చడికి తప్పకుండా బెల్లం వేస్తారు. ఈ బెల్లం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే శరీరంలోని కణాలు నశించకుండా ఉండటంతో పాటు జీవితంలో మీకు సంతోషాల సంతృప్తికి నిదర్శనంగా బెల్లం వేస్తారు. 

పులుపు
చింత పండు పులుపును ఉగాది పచ్చడిలో వాడుతారు. ఇది జీవితంలో వచ్చే కష్ట సుఖాలను కూడా సమానంగా స్వీకరించాలని తెలుపుతుంది. చింత పండు పులుపు జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 

ఇది కూడా చూడండి:  Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!

ఉప్పు
ఉప్పు లేకపోతే వంటలు రుచిగా ఉండవు. కాస్త ఎక్కువైనా, తక్కువైనా కూడా టేస్ట్ ఉండవు. అలాగే జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఎమోషనల్‌గా ఒకేలా ఉండాలని ఉప్పు తెలియజేస్తుంది. 

వగరు
జీవితంలో గాయాలు తాకడం కామన్. వీటిని ఎంత త్వరగా తగ్గించుకుని ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో వగరును ఉగాది పచ్చడిలో వాడుతారు. గాయాలను మాన్పించడంలో వగరు బాగా ఉపయోగపడుతుంది. 

ఇది కూడా చూడండి: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!

కారం
కారం శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి ఉత్తేజాన్ని నింపుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. అయితే ఎక్కువగా కారం తింటే కోపం వస్తుంది. దీనికి ఉదాహరణంగా కారాన్ని పచ్చడిలో వేస్తారు.

చేదు
జీవితంలో కష్టాలు, ఇబ్బందులు సర్వసాధారణం. వీటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలని తెలియజేయడానికి చేదు వాడుతారు. 

ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి: Ugadi 2025: ఉగాది రోజు ఈ రంగు బట్టలు ధరిస్తే ఏడాది అంతా మీకు తిరుగు ఉండదు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు