మారిన జీవన విధానాల వల్ల ఈరోజుల్లో ఎక్కువ మంది పైల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పైల్స్ వస్తే ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూర్చోలేరు. అయితే వాటర్ ఎక్కువగా తాగకపోవడం, తినే ఆహారంలో ఫైబర్ లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఫైల్స్ సమస్య వస్తుంది. అయితే ఈ సమస్యకు ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే ఈ ఆకులతో చెక్ పెట్టండి.
ఇది కూడా చూడండి: ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!
తులసి ఆకులతో..
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండే తులసి ఆకులతో పైల్స్ సమస్యను తగ్గించుకోవచ్చు. రోజూ ఉదయం తులసి ఆకులను తిన్నా లేదా టీ తాగిన జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. దీంతో పైల్స్ సమస్య తగ్గుతుంది. అలాగే గ్యాస్, అజీర్తి, మలబద్ధకం, మలద్వారం దగ్గర నొప్పులు వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.
కలబంద
పైల్స్ సమస్య తగ్గాలంటే కలబంద రసాన్ని డైలీ తాగితే ఉపశమనం లభిస్తుంది. ఇందులోని ఔషధ పోషకాలు పైల్స్‌ను తగ్గిస్తాయి. అయితే ఈ రసాన్ని మలద్వారం దగ్గర అప్లై చేసిన కూడా నొప్పి తగ్గుతుంది.
ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!
మామిడి ఆకులతో..
మామిడి ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పైల్స్ నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. ఈ ఆకులతో మరగబెట్టిన నీరును తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ నీటితో మలద్వారాన్ని శుభ్రం చేసుకున్న కూడా పైల్స్ సమస్య తగ్గుతుంది.
పసుపు ఆకులు..
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండే పసుపు ఆకులు శరీరంలో వేడిని తగ్గించి జీర్ణ క్రియ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పసుపు ఆకుల పేస్ట్‌ను ఆసన ప్రాంతంలో రాస్తే పైల్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం