Strawberries: స్ట్రాబెర్రీలు తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే స్ట్రాబెర్రీలు మాత్రమే కాదు, దాని ఆకులలో కూడా ఎన్నో ఔషధాలు ఉన్నాయి. ఈ రోజుల్లో కొంతమంది జామ్, జెల్లీ, డెజర్ట్ కోసం అలాగే గార్నిషింగ్ కోసం స్ట్రాబెర్రీలను ఉపయోగిస్తున్నారు. స్ట్రాబెర్రీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ ఆక్టికల్‌లో తెలుసుకుందాం. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో.. ఇది గుండెకు మేలు చేస్తుంది. స్ట్రాబెర్రీలు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. స్ట్రాబెర్రీలలో పాలీఫెనాల్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండెపోటు వంటి తీవ్రమైన ప్రమాదాల నుంచి రక్షిస్తాయి. స్ట్రాబెర్రీల్లో ఉండే పొటాషియం గుండెకు దివ్యౌషధం. స్ట్రాబెర్రీలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. స్ట్రాబెర్రీ ఆకులు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది జీవక్రియను మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. గర్భిణీలు ఎరుపు రంగు స్ట్రాబెర్రీలను తినడం చాలా మంచిది. ఒక స్ట్రాబెర్రీలో 27 గ్రాముల కాల్షియం ఉంటుంది. దీని వినియోగం శిశువు దంతాలు, ఎముకల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. జ్యూస్, స్మూతీ, సలాడ్‌లో మిక్స్ చేసి వీటిని తినొచ్చు. స్ట్రాబెర్రీలలోని ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎముకలు బలహీనంగా ఉంటే స్ట్రాబెర్రీలు తింటే కాల్షియం అందుతుంది. స్ట్రాబెర్రీలలో కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.ఇది కూడా చదవండి: ఖరీదైన డ్రైఫ్రూట్స్ కంటే శక్తివంతమైన వేరుశెనగ ఇది కూడా చదవండి: పొరపాటున కూడా పూజగదిలో ఈ వస్తువులు పెట్టొద్దు