అద్భుతం.. మూలవిరాట్‌ను తాకిన సూర్య కిరణాలు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్యకిరణాలు ఈరోజు ఉదయం 6 నిమిషాల పాటు మూలవిరాట్‌ను తాకాయి. భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి పరవశించారు. మార్చి 9, 10, 11, 12.. అక్టోబర్1, 2, 3, 4 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి. 

New Update

శ్రీకాకుళంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అరసవల్లిలో అద్భుతం జరిగింది. ఈ ఆలయంలోని సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్‌ను సూర్య కిరణాలు ఏటా తాకుతాయి. ఇంతటి అద్భుతమైన ఘటన ఈరోజు ఉదయం 6:05 నిమిషాలకు జరిగింది. దాదాపుగా 6 నిమిషాల పాటు సూర్యకిరణాలు సూర్యనారాయణ స్వామి వారి పాదాల నుంచి శిరస్సు వరకు తాకాయి. ఇంతటి అద్భుత ఘటనను చూడటానికి సూర్య భగవాన్ భక్తులు తండోపదండాలుగా తరలివచ్చారు. 

ఇది కూడా చూడండి: గేమ్ ఛేంజర్' సాంగ్.. చరణ్ డ్యాన్స్ పై సమంత కామెంట్ వైరల్

అద్భుత ఘట్టాన్ని చూస్తే..

సూర్య కిరణాలు స్వామి వారి పాదాలను తాకుతుంటే భక్తులు ఆ అద్భుతాన్ని చూసి పరవశించిపోయారు. ప్రతి ఏడాది రెండుసార్లు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. రేపు కూడా సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకనున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చిలో 9, 10వ తేదీల్లో స్వామి వారి పాదాలను సూర్యకిరణాలు తాకాయి. ప్రతీ ఏడాది మార్చి 9, 10, 11, 12 తేదీల్లో, అక్టోబర్ నెలలో 1, 2, 3, 4 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి. 

ఇది కూడా చూడండి:  రుణమాఫీ కాలేదని.. మనస్తాపంతో రైతు ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలో సూర్యనారాయణ స్వామి ఆలయం ఉంది. దేశంలోనే ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. సూర్యనారాయణ మూర్తిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్తుంటారు. ఈ ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు రథసప్తమి రోజు దేవున్ని దర్శించుకోవడానికి భారీగా వెళ్తుంటారు.  

#temple
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe