Somvati Amavasya 2024: సోమవతి అమావాస్య హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన రోజు. సోమవతి అమావాస్య అంటే సోమవారం వచ్చే అమావాస్య తిథి. సోమవారం రోజున అమావాస్య వచ్చినప్పుడు సోమవతి అమావాస్యాను జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 30 సోమవతి అమావాస్య వచ్చింది. ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. సోమవతి అమావాస్య రోజున పూర్వీకులను గౌరవించడానికి ఉపవాసం, పూజలు, తర్పణం, పిండ దానం, దానాలు చేయడం జరుగుతుంది. అంతే కాదు పితృ దోషాల నుంచి విముక్తి కలిగించే వేడుకలను నిర్వహించడానికి సోమవతి అమావాస్యను మంచి రోజుగా పరిగణిస్తారు. ఈరోజున పూర్వీకుల ప్రాప్తి కోసం నిర్వహించే పూజలు దానాలు వారి ఆశీర్వాదాలను పొందడానికి సహాయపడతాయి. సోమవతి అమావాస్యను ఆచరించడం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం, ఆధ్యాత్మిక వృద్ధి, కర్మ రుణాల నుంచి విముక్తి లభిస్తుంది.
సోమవతి అమావాస్యా 2024: పూజా విధానాలు
- ఉపవాసం
సోమవతి అమావాస్యా రోజున భక్తులు ఆహారం లేదా పానీయాలు తీసుకోకుండా ఉపవాసం చేస్తారు.
- పూజలు, ప్రార్థనలు
ఈ రోజున శివుడుకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే పూర్వీకుల ప్రాప్తి కోసం కూడా పూజలు చేస్తారు.
- తర్పణం
పూర్వీకుల ఆశీర్వాదాలు పొందడానికి భక్తులు తర్పణం (పిండ దానం) చేస్తారు.
- దానాలు
పేదలకు ఆహారం, వస్త్రాలు, ఇతర అవసరాలు అందించి దానాలు చేస్తారు.
- పవిత్ర నదులలో స్నానాలు
పూర్వీకుల ఆశీర్వాదాలు, ఆత్మశాంతి కోసం పవిత్రమైన పుణ్య నదులలో స్నానాలు ఆచరిస్తారు. సరస్వతి, యమునా లేదా గంగా వంటి పవిత్ర నదులను సందర్శిస్తారు.
Somvati and Mauni Amavasya:-
— Priyanka (@Astrotherapist1) December 28, 2024
This year Mauni Amavasya falls on a Monday and hence it also becomes Somvati Amavasya.
On December 30th , 2024 we will be observing Mauni and Somvati Amavasya. A very powerful day for those who have Pitra Dosh or Saturn or Sun conjunction or aspect… pic.twitter.com/uIWpaAQ5sv
సోమవతి అమావాస్యా ఆచరిస్తే కలిగే లాభాలు
- పూర్వీకుల ఆశీర్వాదాలు
సోమవతి అమావాస్యా రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదాలు పొందవచ్చు. దీని వల్ల సంతోషం, సంపత్తి విజయాలు లభిస్తాయి.
- ఆధ్యాత్మిక అభివృద్ధి
ఆత్మ పరిశీలన మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఇది ఒక మంచి రోజు.
- క్షమాపణ, విమోచనం
జీవితంలో ఏదైనా తప్పులు చేసినట్లయితే ఈరోజున పూజలు చేయడం ద్వారా క్షమాపణలు కోరుకోవచ్చు అలాగే కర్మ పాపాల నుంచి విమోచనం పొందవచ్చు.
ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?