Snoring Issue: గురకను లైట్ తీసుకుంటున్నారా..? ఇది తెలిస్తే ఫ్యూజులు అవుట్..!!

గురక చిన్న సమస్య కాదు. ఇది స్లీప్ అప్నియాకు సంకేతం కావచ్చు. ఇది రక్తంలో ఆక్సిజన్‌ను తగ్గించి, క్యాన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధుల ముప్పును పెంచుతుంది. తాజా అధ్యయనాల ప్రకారం, గురక ఉన్నవారిలో క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

New Update
Snoring Issue

Snoring Issue

Snoring Issue: నిద్రలో గురక వేస్తున్నారా..? అయితే వెంటనే హాస్పిటల్ కి వెళ్ళండి..  తాజా పరిశోధనలు చెబుతున్నదేమంటే గురక గొంతులోంచి వచ్చే శబ్దం మాత్రమే కాదు, అది అత్యంత ప్రమాదకరమైన వ్యాధులకు మూలం కావచ్చునని పరిశోధనలు స్పష్టంగా చూపిస్తున్నాయి.

గురక వెనక ఉండే ప్రమాదం: స్లీప్ అప్నియా

గురక అనేది చాలా సార్లు అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) అనే నిద్ర సంబంధిత సమస్యకు సంకేతం. ఇందులో నిద్రలో ఉండగా శ్వాస మార్గం తాత్కాలికంగా మూసుకుపోతుంది. దీంతో కొంతసేపు శ్వాస ఆగిపోతుంది, ఆపై మళ్లీ ఊపిరి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది ఈ సమయంలోనే గట్టిగా గురక వినిపిస్తుంది.

ఈ ప్రక్రియ జరిగేటప్పుడు రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువవుతుంది. ఇది శరీరంలో అనేక మార్పులకు దారి తీస్తుంది, ముఖ్యంగా కణజాలాల్లో హానికర మార్పులు (DNA changes) వస్తాయి. దీని వలన క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం చెబుతోంది.

Also Read:ఈ 3 లక్షణాలు మీ పిల్లల్లో ఉంటే.. వారు ఒక మేధావి అని అర్థం!

ఒక పరిశోధనలో సుమారు 2,000 మంది స్లీప్ అప్నియాతో బాధపడుతున్నవారిని 13 ఏళ్ల పాటు పరిశీలించారు. అందులో 9% మందికి క్యాన్సర్ వచ్చిందని తేలింది. ఇది సాధారణ జనాభాలో ఉండే క్యాన్సర్ రేటుతో పోలిస్తే చాలా ఎక్కువ. మరో అధ్యయనం ప్రకారం, స్లీప్ అప్నియాలో ఉన్నవారిలో క్యాన్సర్ రిస్క్ 26% ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

ఊపిరి తీసుకునే మార్గం నిరంతరం అడ్డుపడడం వల్ల శరీరానికి సరైన ఆక్సిజన్ అందదు. దీని వలన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే హానికర రసాయనాలు పెరుగుతాయి. ఇవి కణాలను, డీఎన్‌ఏను దెబ్బతీస్తాయి. దీని వలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి, కణాల్లో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటాయి  ఇవే శరీరంలో క్యాన్సర్‌కు బీజం పడేలా చేస్తాయి.

అంతేకాదు, శరీరం ఆ ప్రభావాలను ఎదుర్కోవడానికి ఇన్‌ఫ్లమేటరీ ప్రొటీన్లను విడుదల చేస్తుంది. ఇవి రక్తనాళాల్లోకి క్యాన్సర్ కణాలు చొచ్చుకుపోయేలా సహాయపడతాయి. ముఖ్యంగా VCAM-1 అనే అణువు క్యాన్సర్ కణాల వ్యాప్తికి ప్రధాన పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మందికి పైగా గురకతో బాధపడుతున్నట్లు అంచనా. కానీ అందులో ఎక్కువ మంది దీన్ని ఒక ఆరోగ్య సమస్యగా పరిగణించరు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రతి 10 మంది స్లీప్ అప్నియా బాధితుల్లో 9 మందికి ఈ సమస్య ఉన్నదే తెలియదు!

మీకు లేదా మీ సన్నిహితులకు గురక ఎక్కువగా ఉంటే, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది కేవలం నిద్రలేమికే కాదు, గుండె జబ్బులు, నరాల సమస్యలు, ఇప్పుడు తాజా అధ్యయనం ప్రకారం క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. సాధ్యమైనంత త్వరగా నిద్ర పరీక్షలు చేయించుకొని, సరైన చికిత్స తీసుకోవడం మంచిది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు