Sneeze Reflex: తుమ్ములు ఎందుకు వస్తాయో మీకు తెలుసా?

సాధారణంగా ఎవరికైనా తుమ్ములు వస్తుంటాయి. జలుబు చేసినప్పుడు మాత్రమే కాదు.. సాధారణ సమయాల్లో కూడా తుమ్ములు వస్తుంటాయి. కానీ చాలా మంది ఈ తమ్ములు ఎందుకు వస్తాయనే విషయం తెలియదు. మరి ఈ తుమ్ములు ఎందుకు వస్తాయనేది తెలుసుకుందాం. 

New Update
FotoJet (8)

Sneeze Reflex

Sneeze Reflex: సాధారణంగా ఎవరికైనా తుమ్ములు వస్తుంటాయి. జలుబు చేసినప్పుడు మాత్రమే కాదు.. సాధారణ సమయాల్లో కూడా తుమ్ములు వస్తుంటాయి. కానీ చాలా మంది ఈ తమ్ములు ఎందుకు వస్తాయనే విషయం తెలియదు. మరి ఈ తుమ్ములు ఎందుకు వస్తాయి? ఎక్కువగా ఈ తుమ్ములు వస్తుంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: Today Horoscope: ఈ రాశుల వారికి బిగ్ అలర్ట్.. అప్పులన్నీ క్లియర్ డబ్బే డబ్బు!

చికాకు వల్ల తుమ్ములు..

తుమ్ము రావడానికి ముఖ్య కారణం అలెర్జీలు కావచ్చని నిపుణులు అంటున్నారు. పోలెన్ రేణువులు, ఇంట్లోని దుమ్ము, పెంపుడు జంతువుల రోమాలు లేదా ఫంగస్ వంటి సూక్ష్మ కణాలు ముక్కులోనికి వెళ్లినప్పుడు రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది. ఆ సమయంలో 'హిస్టమైన్' అనే రసాయనం విడుదల అవుతుంది. ఈ హిస్టమైన్ ముక్కులోని సున్నితమైన పొరలో స్వల్ప వాపు, చికాకును కలిగిస్తుంది. దీంతో ఆ కణాలను బయటికి నెట్టేయడానికి శరీరం పెద్ద మొత్తంలో గాలిని వేగంగా ఊపిరితిత్తుల నుంచి పంపుతుంది. దీన్నే తుమ్ములు అంటారని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Explainer: మెదడుకు పదును 8 అలవాట్లు.. అద్భుతమైన జ్ఞాపకశక్తి కోసం ఇలా ట్రై చేయండి!!

జలుబు లేదా ఫ్లూ వంటి సందర్భాలలో తుమ్ము తరచుగా రావడానికి కారణం వైరల్ ఇన్‌ఫెక్షన్. జలుబు కలిగించే వైరస్‌లు ముక్కు లోపలి మ్యూకస్ మెంబ్రేన్‌ను ఇన్‌ఫెక్ట్ చేసి, వాపును పెంచుతాయి. వైరస్ వ్యాప్తి చెందే కొద్దీ ఆ ప్రాంతంలో చికాకు ఎక్కువై, వరుసగా అనేక తుమ్ములు వస్తాయి. అలెర్జీలు, ఇన్‌ఫెక్షన్లే కాకుండా, పొగ, కాలుష్యం, పర్‌ఫ్యూమ్స్, క్లీనింగ్ రసాయనాలు లేదా మిరప దుమ్ము వంటి ఘాటైన పదార్థాలు కూడా తుమ్మును కలిగిస్తాయి. ఈ రసాయనాలు ముక్కులోని సున్నితమైన నరాలను ఉద్దీపితం చేసి మెదడుకు బయటి నుంచి చికాకు కలిగించే పదార్థం వచ్చిందని.. వెంటనే వాటిని బయటికి పంపాలనే సంకేతాలను పంపిస్తాయి. ఆ వెంటనే శరీరం ఆ కణాలను తుమ్ము రూపంలో బయటికి తోసేస్తుంది.

ఇది కూడా చూడండి: Explainer: గుండెకు మేలు చేసే అద్భుతమైన ఆహారాలు.. జబ్బులను దూరం చేసే పోషకాహార రహస్యం

తుమ్ము రావడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. కొంతమందికి సూర్యకాంతి లేదా హఠాత్తుగా తీవ్రమైన కాంతి కంటికి తగిలినప్పుడు తుమ్ము వస్తుంది. ఇది కంటి నరాలు, ముక్కు నరాలు ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగి ఉండటం వల్ల జరిగే ఒక రిఫ్లెక్స్. సుమారు 18--35% మందిలో ఈ లక్షణం కనిపిస్తుందని అంటున్నారు. అలాగే చల్లని గాలిని పీల్చినప్పుడు కూడా ముక్కులోని నరాలు స్పందించి, రక్షణ చర్యగా తుమ్మును ఉత్పత్తి చేస్తాయి. మరికొందరికి భోజనం చేసిన తర్వాత తుమ్ముతారు. దీనిని 'స్నేటియేషన్' అంటారు. పొట్ట విస్తరించినప్పుడు అది తుమ్మును నియంత్రించే నరాల మార్గాలను ప్రభావితం చేయడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Explainer: పోర్ట్‌ఫోలియో డైట్ రహస్యం తెలుసా..? జీవిత కాలం ఆరోగ్యం కోసం వినూత్న పోషకాహార ఇదే!!

Advertisment
తాజా కథనాలు