శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై నో కండీషన్స్!

అయ్యప్ప మాలను విరమింపజేసేందుకు భక్తులు ఇరుముడితో శబరిమల వెళ్తుంటారు. ఇకపై వీరు విమానాల్లో క్యాబిన్ బ్యాగేజీలో ఇరుముడిలను తీసుకెళ్లవచ్చని, ఈ అవకాశం 2025 జనవరి 20 వరకు మాత్రమే లభిస్తుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపాడు.

New Update
Sabarimala :  సరికొత్త రికార్డ్...రూ. 200కోట్లు దాటిన శబరిమల అయ్యప్ప ఆలయ ఆదాయం..!!

శబరిమల వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అయ్యప్ప మాల వేసిన భక్తులు విరమింపజేసేందుకు ఇరుముడితో శబరిమల వెళ్తుంటారు. అయితే ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కొన్ని కండీషన్స్‌ను తీసేసింది. అయ్యప్పను దర్శించుకునే భక్తులు విమానాల్లో క్యాబిన్ బ్యాగేజీలో ఇరుముడిలను తీసుకెళ్లవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఇది కూడా చూడండి: ఉదయం లేచిన వెంటనే తలనొప్పి వస్తోందా? అయితే తస్మాత్ జాగ్రత్త!

ఈ అవకాశం జనవరి 20 వరకు మాత్రమే..

ఈ అవకాశం 2025 జనవరి 20వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. శబరిమల యాత్ర నవంబర్ నెల మధ్యలో పారంభమై.. జనవరి 20తో ముగుస్తుంది. జనవరి నెలలో మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు ఇరుముడులతో భారీ సంఖ్యతో వెళ్తుంటారు.  

ఇది కూడా చూడండి: యంగ్ హీరోయిన్లను డామినేట్ చేసేలా.. అందంతో మెప్పిస్తున్న బ్యూటీ

ఇదిలా ఉండగా.. అయ్యప్ప దర్శనం చేసుకోవాలంటే కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే నమోదు చేసుకోవాలన్నా నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం ఇటీవల వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటేనే దర్శనం అనే నిర్ణయంపై ఎక్కువగా విమర్శలు రావడంతో ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోకపోయినా భక్తులకు తప్పకుండా అయ్యప్ప దర్శనం కల్పిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు.

ఇది కూడా చూడండి: ఇరాన్‌పై ప్రతీకార దాడులు.. విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

 అలాగే శబరిమలలో అయ్యప్ప దర్శన వేళలు కూడా మర్చారు. వేకువ జామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. మళ్లీ తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగిస్తారని కేరళ ప్రభుత్వం తెలిపింది. దర్శన సమయాల్లో మార్పుల వల్ల భక్తులకు రోజుకీ 17 గంటల సమయం కేటాయించినట్లు అవుతుంది. 

ఇది కూడా చూడండి:  పండగ వేళ సామాన్యులకు షాక్.. పెరిగిన ధరలు

Advertisment
తాజా కథనాలు