Raksha Bandhan Special: అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ తో ఏడ్పించేసిన సినిమాలివే.. మీరు చూశారా?

రేపు రక్షాబంధన్ సందర్భంగా  అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ ప్రధానంగా వచ్చిన సినిమాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. ఒకవేళ మీరు ఈ సినిమాలు చూడన్నట్లైతే ఇప్పుడు చూసేయండి. 

New Update
brother sentiment movies

brother sentiment movies

Raksha Bandhan Special:    రక్షాబంధన్ అనేది తోబుట్టువుల మధ్య అనుబంధాన్ని, ప్రేమను చాటిచెప్పే పండగ! ఈ ప్రత్యేకమైన రోజున అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టి.. వారి అశీసులు తీసుకుంటారు. సోదరుల యోగ క్షేమాలను కోరుకుంటూ ఈ రాఖీని కడతారు. దీనికి ప్రతిగా అన్నదమ్ములు తమ సోదరికి జీవితాంతం తోడుగా, రక్షగా ఉంటామని హామీ ఇస్తారు. నిజజీవితంలోనే కాదు సినిమాల్లోనూ తోబుట్టువుల బంధాన్ని అద్భుతంగా చూపించారు. రేపు రక్షాబంధన్ సందర్భంగా  అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ ప్రధానంగా వచ్చిన సినిమాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. ఒకవేళ మీరు ఈ సినిమాలు చూడన్నట్లైతే ఇప్పుడు చూసేయండి. 

గోరింటాకు.. 

రాజశేఖర్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం అన్నా చెల్లెళ్ళు అనుబంధాన్ని గొప్పగా చూపించింది. పుట్టుకలో మాత్రమే కాదు చావులో కూడా అన్న చెల్లికి తోడుగా ఉంటాడనే భావాన్ని ఎంతో భావోద్వేగంతో తెరకెక్కించారు. 

రాఖీ

 జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఒక సోదరి కోసం ఒక అన్నయ్య ఎంతవరకు పోరాడగలడు అనే విషయాన్ని చూపిస్తుంది. తన చెల్లికి వచ్చిన పరిస్థితి సమాజంలో మరో మహిళకు రాకూడదని రాఖీ చేసిన పోరాటం అందరినీ ఆకట్టుకుంటుంది. 

అన్నవరం 

రాఖీ కట్టిన తర్వాత  చెల్లికి జీవితాంతం రక్షగా, తోడుగా ఉంటానని అన్న ఇచ్చే హామీని ఈ సినిమాలో చూపించారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీలో.. ఒక అన్న తన చెల్లెలిని ఎలా కాపాడుకుంటాడు అనే విషయాన్ని చూపించారు. తన చెల్లెలిని పెళ్లి చేసి పంపించిన తర్వాత కూడా, ఆమెకు ఏ కష్టం వచ్చినా అన్నవరం ఎలా అండగా నిలబడతాడో ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది.

అర్జున్

మహేష్ బాబు- కీర్తి రెడ్డి ప్రధాన ప్రాతలో వచ్చిన ఈ సినిమా ఒక ట్విన్  బ్రదర్ అండ్ సిస్టర్ అనుబంధాన్ని చెబుతుంది. తన సోదరిని ప్రేమగా చూసుకోవడమే కాకుండా, ఆమె పెళ్లి తర్వాత అత్తింట్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ్ముడు  ఎలా రక్షగా ఉన్నాడు అనేది ఈ సినిమాలో చూపించారు. 

పుట్టింటికి రా చెల్లి

అర్జున్ నటించిన ఈ సినిమాలో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని ఎంతో భావోద్వేగంగా చూపించారు. పెళ్లి తర్వాత అత్తవారింట్లో కష్టాలు పడుతున్న తన చెల్లెలిని, అన్న తిరిగి తన పుట్టింటికి తీసుకురావడానికి పడే కష్టాలు ఏంటి అనేది ఇందులో ఉంటుంది. 

హిట్లర్ : 

నలుగురు చెల్లెళ్ళ కోసం అన్నయ పడే కష్టాన్ని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో చెల్లెళ్ళ కోసం అన్నయ చేసే త్యాగాలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఇందులో చిరంజీవి హీరోగా నటించారు. అన్నయ్యగా చిరంజీవి పాత్ర ఆకట్టుకుంది. 

శివరామరాజు 

ముగ్గురు అన్నయ్యలు తన చెల్లి సంతోషం కోసం ఎంతటి దుఃఖానైనా, అవమానాలనైనా  భరించగలరు అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇందులో జగపతి బాబు, వెంకట్, శివాజీ అన్నయ్యల పాత్రలో కనిపించారు. 

Also Read:‘కూలీ’కి ఇక్కడ 'A' సర్టిఫికెట్.. అక్కడ మాత్రం U/A.. షాక్ లో తలైవా ఫ్యాన్స్..!

Advertisment
తాజా కథనాలు