Brinjal Side Effects: వంకాయ పేరు వినగానే చాలా మంది ముఖం చిట్లిస్తారు. చాలామంది ఈ కూరగాయను అస్సలు ఇష్టపడరు. అయితే కొంతమంది వంకాయలు ఇష్టంగా తింటారు. ఈ కూరగాయతో రకరకాలైన వంటలు తయారు చేసి తింటారు. వంకాయ సంవత్సరం పొడవునా లభించే కూరగాయలు. చలికాలంలో దీన్ని ఎక్కువగా తింటారు. వంకాయలు శీతాకాలంలో ఆరోగ్యంగా ఉంటాయని చెబుతారు. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించగలదు, గుండె జబ్బులలో ప్రయోజనకరంగా ఉంటుందట. కొంతమంది వంకాయల నుంచి దూరం పాటించాలి. లేకుంటే వారికి సమస్యలు పెరగవచ్చు. కొన్ని సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా వంకాయలు తినకూడదట. ఎలాంటి వారి వంకాయ తినకూడదో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఈ సమస్యలు ఉంటే వంకాయ తినకూడదు:
చర్మ అలెర్జీ:
- శరీరంలో ఏదైనా రకమైన అలర్జీ ఉంటే.. వంకాయతో చేసిన వాటిని తినకూడదు. లేకపోతే వారి అలెర్జీ మరింత పెరుగుతుంది. అలర్జీ ఉన్నవారు వంకాయకు దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.
డిప్రెషన్:
- డిప్రెషన్‌తో బాధపడేవారు వంకాయను తినకూడదు. ఎందుకంటే డిప్రెషన్‌లో ఉన్నవారు నిరంతరం మందులు తీసుకుంటారు. వంకాయ శరీరానికి చేరి, మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
రక్తం లేకపోవడం:
- శరీరంలో రక్తం లేనివారు పొరపాటున కూడా వంకాయ తినకూడదు. ఎందుకంటే వంకాయ శరీరంలో రక్తం ఏర్పడే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది అనేక సమస్యలను పెంచుతుంది.
గ్యాస్ సమస్యలు:
- వంకాయ తింటే గ్యాస్ వస్తుంది. గ్యాస్, కడుపు సమస్యలు ఉంటే వంకాయతో చేసిన వాటికి దూరంగా ఉండాలి. లేకపోతే సమస్య పెరుగుతుంది.
పైల్స్:
- పైల్స్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. అలాంటి వారు పొరపాటున వంకాయ తింటే వారికి ఇబ్బందులు తప్పవని డాక్టర్ల చెబుతున్నారు.
కంటి సమస్యలు:
- కళ్లలో మంట, కుట్టడం, అలర్జీ, వాపు వంటి సమస్యలు ఉంటే వంకాయ తినవద్దు. ఎందుకంటే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కంటి సమస్యల సమయంలో వంకాయ తినడం అస్సలు సరికాదు.
కిడ్నీలో రాళ్లు:
- వంకాయలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది కడుపులో రాళ్లను ఏర్పరుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా రాళ్ల సమస్య ఉంటే వంకాయలు తినకూడదు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.