కోపం ..మహా పాపామే కాదు చెడ్డగుణం కూడా. ఇది పిల్లలకు తప్ప పెద్దలందరికీ తెలిసినప్పటికీ...అదుపు తప్పి సీరియస్ అవుతారు. కొందరు పిల్లలకి కోపం వస్తే.. చేతిలో ఏ వస్తువు ఉంటే దాన్ని విసిరేస్తుంటారు. మరికొందరు కొట్టడం, కొరకడం లాంటివి చేస్తారు. ఆ కోపాన్ని కంట్రోల్ చేయడం ఎలా అనేది ..నేటి తల్లిదండ్రులు బాధ్యతగా గుర్తించాలి.
ఇది కూడా చదవండి: Depression: ముఖం చూసి ఆరోగ్యం చెప్పేసే ఏఐ టెక్నాలజీ
కంట్రోల్ చేయకపోతే కష్టం..
పిల్లలకు కోపం వస్తే వారి మానసిక స్థితి హింస్మాత్మకంగా మారుతుంది. పిల్లల్లో కోపాన్ని కంట్రోల్ చేయడానికి తల్లిదండ్రులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. మొక్కై వంగనది...మానై వంగునా అన్న చందంగా ...పిల్లలను ప్రాథమిక దశలోనే అదుపులో చేయకపోతే....పెద్దయ్యాక వారు హుందాగా ప్రవర్తించడానికి అవకాశం ఉండదు. దూకుడుగా వ్యవహరించే పిల్లలను రాంబుక్టివ్ పిల్లలుగా వ్యవహరిస్తారు. అలాంటివారిపై కోపింగ్ స్ట్రాటజీని ఉపయోగించకుండా...ప్రశాంతంగా వ్యవహరించాలి. ఏడిచే పిల్లలతో ఏదో ఒకటి మాట్లాడితే వారిలో తప్పకుండా పరివర్తన ఏర్పడుతోంది.
ఇది కూడా చదవండి: Health Tips:గుండెను మరింత బలోపేతం చేయడానికి ఈ పోషకాలు అవసరం!