డబుల్ షాక్.. క్వాలిటీ టెస్ట్‌లో ఆ ట్యాబ్లెట్స్ ఫెయిల్..మొత్తం ఎన్నంటే?

ఇండియాలో ఎక్కువగా వాడే 71 ట్యాబ్లెట్స్ క్వాలిటీ టెస్ట్‌లో ఫెయిల్ అయినట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది. అనారోగ్య సమస్యలకు వాడుతున్నషెల్కాల్ 500, ప్యాంట్యాబ్ డీ సహా మరో 69 ట్యాబ్లెట్లు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయ్యాయి.

tablats
New Update

ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడేవారిలో భారతీయులే అధికం. చిన్నపాటి అనారోగ్యానికి ట్యాబ్లెట్లకు పరిమితం అవుతారు. జలుబు, దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్ వంటి ఇతర చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు పూటపూటకి గోలీలు మింగేస్తుంటారు. అలాంటి వారు కాస్త జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది.

ఇది కూడా చూడండి: ట్రామీ తుపాను బీభత్సం.. 130కి చేరిన మృతుల సంఖ్య

71 ట్యాబ్లెట్లు క్వాలిటీ టెస్ట్‌లో ఫెయిల్

ఎందుకంటే ఇండియాలో ఎక్కువగా వాడే కొన్ని ట్యాబ్లెట్స్ క్వాలిటీ టెస్ట్‌లో ఫెయిల్ అయినట్లు CDSCO (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్) తాజాగా తెలిపింది. ఈ మేరకు మన దేశంలో అనారోగ్య సమస్యలకు వాడుతున్న దాదాపు 71 ట్యాబ్లెట్లు క్వాలిటీ టెస్ట్‌లో ఫెయిల్ అయినట్లు పేర్కొంది. ఇందులో భాగంగా కీలక విషయాన్ని వెల్లడించింది.

ఇది కూడా చూడండి: అరుదైన ఘనత.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా..

షెల్కాల్ 500, ప్యాంట్యాబ్ డీ ట్యాబ్లెట్లతో సహా మరో 69 ట్యాబ్లెట్లు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ కావడం ఆందోళన కలిగించే విషయమని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఈ మొత్తం 71 ట్యాబ్లెట్ల లిస్ట్‌లో కొన్ని యాంటీబయాటిక్స్, మరికొన్ని డయాబెటిస్ మెడిసిన్స్, దగ్గు మందు సిరప్‌లు, ఇంకొన్ని బీపీ ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయని చెప్పింది. 

ఇది కూడా చూడండి: ఆగని బాంబు బెదిరింపులు.. విజయవాడలోని ఓ హోటల్‌కు..

కాగా CDSCO ఇదివరకే కొన్ని హెచ్చరికలు చేసింది. విటమిన్ D3 సప్లిమెంట్లు, కాల్షియం, హై బీపీ ట్యాబ్లెట్, యాంటీ డయాబెటిస్ మాత్రలు సహా మరో 50 కంటే ఎక్కువ ట్యాబ్లెట్లు డ్రగ్ రెగ్యులేటర్ చేసే క్వాలిటీ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యాయని తెలిపింది.

ఇది కూడా చూడండి: జగన్‌, షర్మిల ఆస్తుల వివాదం..మధ్యలో పవన్ ఎంట్రీ? వారి ఛాప్టెర్ క్లోజ్!

ఇందులో భాగంగా CDSCO 53 టాబ్లెట్లను నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీగా (Paracetamol quality test fail) పేర్కొంది. దీంతో ఆగస్ట్‌ నెలలో భారతీయ మార్కెట్‌లో 156 ఫిక్స్‌డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్‌లను CDSCO నిషేధించింది. ఈ ట్యాబ్లెట్లలో జ్వరం, పెయిన్ రిలీఫ్, అలెర్జీ వంటి ట్యాబ్లెట్లు ఉన్నాయి.

ఇవి మాత్రమే కాకుండా పారాసెటమాల్ ఐపి 500 ఎంజి, విటమిన్ సి, డి, విటమిన్ సి సాఫ్ట్‌జెల్స్, విటమిన్ బి కాంప్లెక్స్, షెల్కాల్, యాంటీ డయాబెటిక్ డ్రగ్ గ్లిమెపిరైడ్, యాంటీ యాసిడ్ పాన్-డి, హై బ్లడ్ ప్రెజర్ డ్రగ్ టెల్మిసార్టన్ వంటి 53 రకాల మెడిషన్స్ డ్రగ్ రెగ్యులేటర్ టెస్ట్‌లో Not of Standard Qualityలోకి చేరినట్లు CDSCO తెలిపింది. దీంతో అంతా షాక్ అవుతున్నారు. 

#vitamin #fake-medicines
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe