ఈ గ్రామంలో ఎవరింట్లోనూ పొయ్యి వెలిగించరు.. కారణమేంటో తెలుసా? గుజరాత్‌లోని చందన్‌కీలో ప్రతి ఇంట్లో ఎవరూ వండుకోరు. గ్రామ సర్పంచ్ పూనంబహాయి పటేల్ ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్లోనే అందరూ భోజనం చేస్తారు. యువత ఉద్యోగాలకు పట్టణాలకు వెళ్లడం వల్ల వృద్ధులు పడుతున్న ఇబ్బందిని చూడలేక పూనంబహాయి ఈ హాల్‌ను ఏర్పాటు చేశారు. By Kusuma 25 Sep 2024 in లైఫ్ స్టైల్ Short News New Update షేర్ చేయండి సాధారణంగా గ్రామాల్లో భోజనాలు ఉంటే ఎవరూ ఇంట్లో వండుకోరు. కానీ గుజరాత్‌లోని చందన్‌కీ గ్రామంలో ఏడాదిలో ఒక్కరోజూ కూడా ఇంట్లో వండుకోరు. ఈ గ్రామం మొత్తానికి కలిపి ఉన్న కమ్యూనిటీ హాల్లోనే అందరూ తింటారు. చిన్న గ్రామమైన చందన్‌కీలో 250 మందికి పైగా మాత్రమే జనాభా ఉంటారు. ఈ జనాభాలో ఎక్కువగా సీనియర్ సిటిజన్లు ఉండగా.. మిగిలినవారిలో యువత ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్లిపోయేవారు. సంప్రదాయ గుజరాతీ భోజనం వృద్ధులు వారు రోజువారీ పనులు చేయలేక ఇబ్బంది పడేవారు. వీరి ఇబ్బందిని గమనించిన ఆ గ్రామ సర్పంచ్ పూనంబహాయి పటేల్ అందరికీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. గ్రామంలో ఉన్నవారంతా కలిసి ఒకేసారి భోజనం చేస్తారు. ఇక్కడ రోజుకి రెండు పూటలు మాత్రమే భోజనం పెడతారు. ఒక్కో వ్యక్తి నెలకు 2000 రూపాయలు చెల్లిస్తే.. గుజరాతీ భోజనాన్ని అందిస్తారు. ఈ కారణంతో గ్రామంలోని ఒక్క కుటుంబం కూడా ఇంట్లో వండుకోరు. ఈ కమ్యూనిటీ హాల్లోనే భోజనం చేస్తారు. #gujarath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి