Gas Diseases: గ్యాస్‌ మాత్రలతో మరిన్ని రోగాలు ఖాయమా?

అసిడిటీ సమస్య నుంచి బయటపడేందుకు టాబ్లెట్స్‌ తీసుకుంటారు. దీనివల్ల రిలాక్స్‌గా అనిపించినా.. శరీరానికి అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుందట. యాసిడ్ రిఫ్లక్స్ మాత్రలు వల్ల తీవ్రమైన ఆరోగ్య నష్టంతోపాటు డిమెన్షియా, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

gas diseases

Gas Diseases

New Update

Gas Diseases: ప్రస్తుతం అసిడిటీ అనేది చాలా సాధారణ సమస్య. చాలా స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఛాతీ, కడుపులో మంట వస్తుంది. దీనినే అసిడిటీ అంటారు. ఈ స్థితిలో కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి వెళ్లి చికాకు, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. సాధారణంగా ఈ సమస్య అసిడిటీ మందులతో తగ్గుతుంది. ప్రతి ఒక్కరికి ఉదయం నిద్ర లేవగానే అసిడిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం పూట భోజనం చేసే సమయానికి పెరిగిపోతుంది. అందుకే కడుపుని ఖాళీగా ఉంచకూడదు. అల్పాహారం, భోజనం మధ్య చాలా సమయం గ్యాప్ ఉంది. ఆ టైమ్ గ్యాప్‌లో ఏదోకటి తినాలి.

శరీరానికి అనేక దుష్ప్రభావాలు:

  • ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది రోజూ టాబ్లెట్స్‌ తీసుకుంటారు. దీనివల్ల ఆ క్షణం మనకు రిలాక్స్‌గా అనిపిస్తుంది, కానీ ఇది మన శరీరానికి అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. వైద్యుల నివేదికల ప్రకారం యాసిడ్ రిఫ్లక్స్ మాత్రలు పదేపదే తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య నష్టం జరుగుతుంది. గ్యాస్‌ టాబ్లెట్స్‌ వేసుకోవడం వల్ల డిమెన్షియా, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: పాలు లేకుండానే వెన్న తయారు చేస్తున్న కంపెనీ

  • యాసిడ్ రిఫ్లక్స్ చికిత్సకు ఉపయోగించే మందులు దీర్ఘకాలికంగా తీసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మందులు శరీరంలో కాల్షియం శోషణను ప్రభావితం చేస్తాయి. ఇది ఎముకలు బలహీనపడటానికి దారితీస్తుంది. మీరు ఇప్పటికే మెదడు లేదా ఎముక సమస్యలతో పోరాడుతున్నట్లయితే, చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు. యాసిడ్ రిఫ్లక్స్ కోసం ఉపయోగించే మందులను ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు. అందుకే వీటిని ఎక్కువ కాలం వాడకూడదని చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి:  చూసేందుకు చిన్న చేప..సౌండ్‌ మాత్రం సాలిడ్‌గా ఉంటుంది

 

 

ఇది కూడా చదవండి:  భోజనంతో పాటు పచ్చిమిర్చి తింటే ప్రయోజనమా?

#gas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe