Health Tips: మీ పిల్లలకు జ్ఞాపకశక్తి పెరగాలంటే.. ఈ ఫుడ్ పెట్టండి!

కొబ్బరిలో మెదడుకు అతి ముఖ్యమైన మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. పిల్లల తెలివితేటలకి, జ్ఞాపకశక్తికి పెరగడానికి పంచదార లేకుండా ఎండు ఖర్జూరం పొడి, కొబ్బరి పొడి కలిపి తినిపిస్తే.. మేధాశక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Health

Health Tips: హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏ శుభకార్యం జరిగినా.. ఏ పూజలోనైనా ముందుగా కొబ్బరికాయతోనే ప్రారంభిస్తారు. అయితే కొబ్బరికాయని, కొబ్బరి నీళ్లను రోజు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతగా ఎంతో మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా దీనివల్ల అనేక ఆనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయంటారు. అయితే అలాంటి వాటిల్లో మనకు బ్రెయిన్ డెవలప్మెంట్‌కు సంబంధించిన మంచి కొవ్వులు కావాలి. అలాంటి మంచి కొవ్వులు కొబ్బరిలో పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ కొబ్బరిని, ఎండి ఖర్జూర పొడితో కలిపి తీసుకుంటే మెదడుకు అతి ముఖ్యమైన కొవ్వులు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి, ఖర్జూర పొడి తీసుకుంటే బ్రేయిన్‌కి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌ల్లో తెలుసుకుందాం. 

మనం వంటల్లో వాడే నూనె కంటే.. కొబ్బరి నూనెతో చేసిన వంటలు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. కేరళ వాళ్ళు ఎక్కువగా కొబ్బరితో చేసిన వంటలు తింటారు. కాబట్టే అందరికంటే ఎక్కువ తెలివితేటలు వారికి ఉంటాయిట. కొబ్బరి ఎక్కువగా తింటారు కాబట్టి ఇండియాలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రంగా కేరళకు పేరు ఉంది. పిల్లల తెలివితేటలకి, జ్ఞాపకశక్తి పెరగడానికి కొబ్బంది పొడిలో కొంచెం ఎండు ఖర్జూరం పొడి కలిపి తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు ఇది మెదడుకి అతి ముఖ్యమైన కొవ్వులు అందేలా చేస్తుంది. బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కు ఉపయోగపడే మంచి కొవ్వులన్నీ కొబ్బరిలో అధికంగా ఉన్నాయి. అందుకనే పూర్వం నుంచి ఆచారాలలో, ప్రతి శుభకార్యంలో, ప్రతి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టించేవారు. పిల్లల తెలివితేటలకి, జ్ఞాపకశక్తికి పెరగడానికి పంచదార లేకుండా ఎండు ఖర్జూరం పొడి, కొబ్బరి పొడి రెండు కలిపి తినబెడితే ఎంతో రుచితోపాటు మేధాశక్తి పెదగడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు