కర్పూరం-ఆవనూనెతో కీళ్లు, నడుమునొప్పికి ఇలా చెక్ పెట్టండి

కర్పూరం-ఆవనూనెతో మర్దన చేస్తే కీళ్ల, నడుము నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కర్పూరం-ఆవనూనె యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంపై చాలా ఎఫెక్ట్‌ చూపిస్తాయి. జలుబు, దగ్గును తగ్గించి చర్మం మెరిసేలా చేస్తుంది.

New Update
mustard oil

Mustard Oil: ఆయుర్వేదంలో కర్పూరానికి-ఆవనూనెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆవనూనె చాలా ఏళ్ల నుంచి వంట కోసం, చర్మం , జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. దీనిని వాడటం వలన చర్మ సమస్యలతో పాటు కీళ్ల, నడుము నొప్పుల వంటి వాటికి బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆవనూనెలో విటమిన్లు, ఫ్యాట్, యాసిడ్లు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు ఉంటాయి. కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్‌, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చాలా ఎఫెక్ట్‌గా పనిచేస్తాయి
అయితే ఆవనూనెలో- కర్పూరం కలిపి వాడితే చాలా ప్రయోజకరణంగా ఉంటుందట. అంతే కాకుండా  చర్మ, జుట్టు, మొటిమలు, జలుబు, నడుము, దగ్గు వంటి సమస్యలకు కర్పూరం-ఆవనూనె బాగా పనిచేస్తుందట. అయితే ఈ సీజన్‌లో కర్పూరం ఆవాలనూనె కలిపి వాడితే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కర్పూరం-ఆవాలనూనె ప్రయోజనాలు:

  • కర్పూరాన్ని కలిపి ఆవనూనె గొప్ప ఔషధంలా పనిచేస్తుంది.
  • కర్పూరం కలిపిన ఆవనూనె కీళ్ల నొప్పులకు బాగా పనిచేస్తుంది.
  • కీళ్లనొప్పులు ఉన్నప్పుడు ఈ నూనెను అప్లై చేస్తే ఉపశమనం ఉంటుంది.
  • కర్పూరం కలిపిన ఆవనూనెతో మర్దన చేస్తే వాపు తగ్గిపోతుంది.
  • ఆవాల నూనెలో కర్పూరం కలిపి మర్దన చేస్తే కండరాలు పుష్టిగా ఉంటాయి. కండరాల మంట తగ్గుతుంది.
  • కర్పూరం-ఆవాలనూనె జలుబు, దగ్గు, మూసుకుపోయిన ముక్కు నుంచి ఉపశమనం ఇస్తుంది.
  • కర్పూరం కలిపిన ఆవాల నూనెతో మసాజ్ చేస్తే చర్మం లోపల శుభ్రం పడుతుంది. మొటిమలు, దురద, మంట, ఫంగల్, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
  • తరచుగా నడుము, వెన్ను నొప్పితో బాధపడేవారు ఈ నూనెతో మర్దన చేస్తే నొప్పులు మాయం అవుతాయి.
  • కర్పూరం కలిపిన అవనూనెతో మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా మారుతుంది.
  • కర్పూరం కలిపిన ఆవనూనె చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి చర్మానికి మెరుపును ఇస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు