/rtv/media/media_files/2026/02/15/mahashivratri-2026-rashifal-5-2026-02-15-11-43-12.jpg)
mahashivratri
Mahashivratri 2026: భారతీయులు దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగలకు ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో ఒకటైన మహా శివరాత్రి వేడుకకు కూడా ఒక నేపథ్యం, అనేక కథలు ఉన్నాయి.
శివ పార్వతుల కళ్యాణం (ప్రకృతి-పురుషుల కలయిక)
శివరాత్రి అంటే శివుడు పార్వతి దేవిని వివాహం చేసుకున్న రోజు అని చెబుతారు. దీని అంతరార్థం విషయానికొస్తే.. నిశ్చల స్థితిలో ఉండే 'శివుడు' (పురుషుడు), శక్తి స్వరూపిణి అయిన 'పార్వతి' (ప్రకృతి) ఒకటి కావడం. సృష్టి కార్యానికి ఈ కలయిక ఒక పునాదిగా భావిస్తారు. అందువల్లే ఈ రోజును భక్తులు ఒక పవిత్రమైన బంధంగా భావిస్తారు.
క్షీరసాగర మథనం -హాలాహలం (లోక కళ్యాణం)
క్షీరసాగర మథనం -హాలాహలం అంటే.. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మథించినప్పుడు పుట్టిన విషాన్ని (హాలాహలం) లోకాలను రక్షించడం కోసం శివుడు దాన్ని స్వీకరించాడు. అయితే ఇందులో పార్వతి దేవి పాత్ర అత్యంత కీలకం. శివుడు తాగిన ఆ విషం గొంతు నుంచి పొట్టలోకి వెళ్తే లోపల ఉన్న సృష్టికి ముప్పు వాటిల్లుతుందని పార్వతి దేవి శివుని గొంతును గట్టిగా పట్టుకుందని.. దీని వల్ల ఆ విషం గొంతులోనే ఉండిపోయి.. శివుని కంఠం నీలం కలర్‌లోకి మారిందని పురాణాలు చెబుతున్నాయి. దీని కారణంగానే ఆయనకు 'నీలకంఠుడు' అనే పేరు వచ్చింది.
గంగావతరణం
భగీరథుని తపస్సుకు సంతోషించిన శివుడు స్వర్గం నుండి దిగివస్తున్న గంగానది ఉధృతికి భూమి తట్టుకోలేదని గ్రహించి.. ఆమెను తన జటాజూటం (జడలు) లో బంధించాడని ఇంకొన్ని పురాణాలు పేర్కొన్నాయి. గంగ అహంకారాన్ని, వేగాన్ని నియంత్రించి, ఆపై భగీరథుని ప్రార్థన మేరకు లోక ప్రయోజనం కోసం చిన్న ధారగా భూమిపైకి వదిలాడు అని చెబుతారు.
శివరాత్రి నాడు శివుడు లింగ రూపంలో విష్ణువు, బ్రహ్మలకు కనిపించాడని.. వారు శివుని ప్రారంభం, ముగింపును కనుగొనడానికి బయలుదేరారని కూడా నమ్ముతారు. కైలాస నివాసి శివుడికి శివరాత్రి అత్యంత ప్రియమైన రోజు. అందువల్ల శివరాత్రి రోజు తనను పూజించే భక్తులకు ప్రత్యేక ఆశీస్సులు ప్రసాదిస్తానని వాగ్దానం చేస్తూ శివుడే పార్వతిగా అవతరించాడని శివ పురాణం పేర్కొంది.
జాగరణ ప్రాముఖ్యత
మాఘ బహుళ చతుర్దశి రాత్రి శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడని చెబుతారు. ఈ విధంగా ఆ రాత్రి అందరు దేవతలు జాగరణ చేసి గిరిజ వివాహాన్ని వీక్షించి శివపార్వతి ఇద్దరినీ పూజించారు. జాగరణ వ్యవస్థ ఆచరణలోకి వచ్చిన విధానం ఇలాగే ఉందని పండితులు చెబుతారు. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో కృష్ణ పక్ష నాల్గవ రోజున శివుడు పార్వతితో కలిసి రాత్రిపూట భూమిపై తిరుగుతూ అన్ని మొక్కలలోకి, లింగాలలోకి పరివర్తన చెందుతాడు. శివరాత్రి రోజు రాత్రి తనను పూజించే వారి పాపాలు క్షమించబడతాయని శివుడు స్వయంగా చెప్పాడని ఒక గ్రంథంలో ఉంది. తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసి ఉపవాసం ఉండి శివాలయాలను సందర్శించి, రాత్రంతా మేల్కొని శివుడిని పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
Follow Us