Tea Benefits: ఈ టీ తాగితే గుట్టలాంటి పొట్టైనా ఇట్టే కరిగిపోద్ది

వేడివేడిగా కప్పు టీ, కాఫీ తాగితే మనసుకి హాయిగా ఉంటుంది. వివిధ రకాల టీలు మనకు మార్కెట్‌లో లభిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన పదార్ధాలతో టీ చేసి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పుదీనా, లవంగం, జీలకర్రతో చేసిన టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

New Update
Cumin Tea

Tea Benefits: ఉదయం నిద్రలేవగానే  వేడివేడిగా టీ, కాఫీ తాగనిదే మనకు ఏమీ తోచదు. టీ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అయితే కొన్ని రకాల టీలు గ్యాస్, అజీర్ణం, బరువు తగ్గడంతోపాటు అనేక సమస్యలకు చక్కటి పరిష్కారం. అయితే రోజూ తాగే టీ డికాషిన్‌తో కాకుండా కొన్ని ప్రత్యేకమైన పదార్ధాలతో టీ చేసుకుని తాగితే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ స్పెషల్ టీ చేసే విధానం.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

పుదీనా:

పుదీనా ఆకులతో మెడిసిన్‌ తయారు చేస్తారు. అజీర్ణ సమస్య ఉన్నవారికి ఈ ఆకులతో చేసిన టీ తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయి. అంతేకాకుండా నోటి దుర్వాసన, మానసిక అలసట, అజీర్ణం వంటి సమస్యలకు బెస్ట్ మెడిసిన్‌గా పని చేస్తుంది. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఈ టీ ఉత్తమని నిపుణులు చెబుతున్నారు. ఈ టీని చేయాలంటే పుదీనా ఆకులు, పుదీనా పొడిని వేడినీటిలో వేసి బాగా మరిగించాలి. కొద్దిసేపు మూత పెట్టాలి. తర్వాత చేసి వేడివేడిగా తాగవచ్చు.
 
లవంగం టీ:

లవంగాలు ఆరోగ్యానికి మంచి ఎంపిక. వీటిని తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. లవంగాలలోని పదార్ధం జీర్ణ ఎంజైమ్‌లను విడుదల చేస్తుంది. ఇందులోని యూజినాల్ జీర్ణాశయంలో మంటను తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది. లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. కొన్ని లవంగాలను వేడి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. కావాలనుకుంటే అల్లం వేసికూడా తాగవచ్చు.
 
జీలకర్ర టీ:

జీలకర్రలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. జీలకర్ర జీర్ణక్రియకు మేలు చేస్తుంది. గ్యాస్, అజీర్తి సమస్యలకు జీలకర్ర బాగా పని చేస్తుంది. అంతేకాకుండా ఆందోళన తగ్గించి మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. జీలకర్రను నీళ్లతో మరిగించి వడకట్టాలి. దీనిని ఉదయం తాగితే కడుపు సమస్యలు తగ్గుతాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు