/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/rice-for-Lord-Venkateswara-Swamy-god-blessing-2-jpg.webp)
Venkateswara
వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు ఎంతో ప్రత్యేకమైనది. మిగతా రోజులతో పోలిస్తే శనివారం రోజు వెంకటేశ్వరుని ఎక్కువగా పూజిస్తుంటారు. అయితే ఎప్పటిలా కాకుండా ఇలా పిండితో దీపం పెట్టుకుంటే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. ముఖ్యంగా సొంత ఇంటి కల నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. అయితే కేవలం బియ్యం పిండితో ఓ దీపం చేసి వెలిగించాలి.
ఇది కూడా చూడండి: Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
బెల్లం, బియ్యం పిండితో దీపం చేసి..
ఈ దీపం తయారు చేయడానికి కొంచెం బియ్యం పిండిని తీసుకోవాలి. అందులో కాస్త బెల్లం తురుము, ఆవు నెయ్యి, నీళ్లు వేసి ముద్ద కింద చేసుకోవాలి. దీన్ని దీపంలా తయారు చేసి అందులో నెయ్యి వేయాలి. ఈ దీపానికి కుంకుమ, పసుపు బొట్లు పెట్టాలి. అయితే కొందరు రెండు వత్తులతో దీపం పెడతారు. ఇలా కాకుండా ఏడు వత్తులతో దీపం పెట్టాలి. మీరు దీపం వెలిగించే ముందు మీ మనస్సులో ఉన్న కోరికను కోరుకోవాలి. ఆ తర్వాత బెల్లం లేదా పండ్లు, పాయసం ఏదో నైవేద్యంగా చేయాలి.
ఇది కూడా చూడండి: Tushar Gandhi: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...
ఇలా ప్రతీ శనివారం చేస్తే అప్పుల బాధలే అన్ని కూడా తీరిపోతాయి. అలాగే ఇంట్లో ఎలాంటి డబ్బు కొరత కూడా ఉండదు. ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలతో పాటు సొంతింటి కల కూడా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి:Ranya Rao Case: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!