/rtv/media/media_files/2025/03/02/v7RknV7acXS4VuN9RdKx.jpg)
Almond
Life Style: బాదం ఆరోగ్యానికి మంచిదని డైలీ తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతుంటారు. బాదం తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని, తెలివి వస్తుందని చాలా మంది వీటిని నానబెట్టి మరి తింటుంటారు.అయితే బాదం కంటే వాల్ నట్స్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందన నిపుణులు చెబుతున్నారు.
బాదం ఎలా రాత్రి పూట నానబెట్టి ఉదయం తింటారో.. అలాగే వాల్‌నట్స్‌ను కూడా అలాగే నానబెట్టి తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. రోజుకి ఒక ఐదు బాదం, వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల బాడీకి పోషకాలు అందుతాయి.
మెదడు పనితీరు
ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. డైలీ బాదం కంటే వాల్ నట్స్ తినడం వల్ల మెదడు పనితీరు పెరిగి, ఆల్జెమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం తక్కువని నిపుణులు అంటున్నారు.
ఇప్పుడు బాదాం పప్పుతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
గుండె ఆరోగ్యం
గుండె ఆరోగ్యానికి మంచిది బాదంలోనీ మోనోశాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో తోడపడతాయి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణుల సూచన .
చక్కర స్థాయిలు
రక్తంలో చక్కెర స్థాయిలు మధుమేహం ఉన్నవారికి బాదం పప్పు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే బాదంలోని ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మాత్తుగా పెరగకుండా తోడపడతాయి.