Life Style: వీటిని తినాలనిపిస్తే.. ఈ లోపం ఉన్నట్లే!

కొంతమందికి పదే పదే ఒకే ఫుడ్ తినాలనే కోరిక కలుగుతుంది. అయితే ఇది శరీరంలో పోషకాహార లోపానికి సంకేతామని నిపుణులు చెబుతున్నారు. ఏ ఆహార కోరిక ఏ లోపాన్ని సూచిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

New Update
Healthy Evening Snacks

Food cravings

Life Style: కొంతమందికి పదే పదే ఒకే ఆహరం తినాలనే కోరిక కలుగుతుంటుంది.  ఇలాంటి పరిస్థితి శరీరంలో   పోషకాహార లోపానికి సంకేతం.  ఏ ఆహార కోరిక ఏ లోపాన్ని సూచిస్తుందో తెలుసుకోండి.

చిప్స్

ప్యాక్ చేసిన చిప్స్ లేదా ఉప్పగా ఉండే స్నాక్స్ తినాలని కోరిక కలగడం శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యతను సూచిస్తుంది.  అలాంటి సందర్భంలో, కొబ్బరి నీరు, సముద్రపు ఉప్పు, అరటిపండు వంటివి తినండి.

చల్లని ఆహారాలు

ఐస్ క్రీమ్  లేదా చల్లని ఆహారాలు తినాలనిపించడం  ఐరన్ లోపానికి సంకేతం.  అటువంటి పరిస్థితిలో, ఐరన్ లోపాన్ని అధిగమించడానికి, ఉడికించిన బీట్‌రూట్, పాలకూర, పప్పుధాన్యాలు, రెడ్  మీట్ తినమని సూచిస్తున్నారు. 

చాక్లెట్

మళ్ళీ మళ్ళీ చాక్లెట్ తినాలని కోరిక కలగడం  శరీరంలో మెగ్నీషియం లోపానికి సంకేతామని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఊరికే  చాక్లెట్ తినాలనిపించేవారు, శరీరంలో మేగ్నిషియం కోసం  గుమ్మడికాయ గింజలు, బాదం  ఆకుకూరలు తినండి.

నూనె ఆహారాలు

మీకు వేయించిన ఆహారం, నూనె పదార్థాలు తినాలనిపిస్తే  శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వులు లేవని అని అర్థం. ఇలాంటి పరిస్థితిలో  మీ శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అనవసరం. వీటి కోసం అవకాడో, సాల్మన్ చేప, ఆలివ్ నూనె లేదా వాల్‌నట్స్ తినండి.

చక్కెర ఫుడ్స్

మళ్ళీ మళ్ళీ స్వీట్లు తినాలని తినాలనిపించడం శరీరంలో క్రోమియం, సల్ఫర్, భాస్వరం, కార్బన్, ట్రిప్టోఫాన్ లోపం ఉందని అర్థం. ముఖ్యంగా క్రోమియం లోపం వల్ల చక్కెర తినాలనే  కోరిక పెరుగుతుంది.అయితే  క్రోమియం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల, ఆ ఫీలింగ్ కలుగుతుంది.  ఈ సమస్య ఉన్నవారు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు,  వంటివి  కొనసాగించండి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు