వర్షాకాలం వచ్చిందంటే ప్రజల్లో జ్వరాల భయం మొదలవుతుంది. ఈ సీజన్ లో వాతావరంలోని మార్పుల కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి విపరీతంగా పెరుగుతుంది. ఒకరి నుంచి ఒకరికి ఇలా ఊరంతా వ్యాప్తి చెందిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ రావడానికి కారణమేంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం
దోమల వ్యాప్తి
వర్షాకాలంలో ఎక్కడపడితే అక్కడ వర్షపు నీటి నిల్వలు దర్శనమిస్తాయి. ఈ వర్షపు నీటి నిల్వలు దోమల పెంపకానికి అనువైన ప్రదేశంగా ఉంటుంది. దీని వల్ల దోమలు పెరిగి వైరల్ ఫీవర్ , మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి వ్యాధులకు కారణమవుతాయి. అందుకే వర్ష కాలంలో ఇంటి చుట్టు పక్కల ప్రదేశాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి.
వైరల్ ఇన్ఫెక్షన్స్
వర్షాకాలంలో వాతావరణం చల్లగా, తేమగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు తరచూ ఫ్లూ, జలుబు, వైరల్ ఫీవర్స్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుదలకు దారితీస్తాయి.
నీటి ద్వారా వచ్చే వ్యాధులు
వర్షాకాలంలో వరద నీటి కారణంగా నీరు కలుషితం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దీని వల్ల నీటి ద్వారా వ్యాపించే టైఫాయిడ్, లెప్టోస్పిరోసిస్, కలరా వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
బలహీనమైన రోగనిరోధక శక్తి
వర్షాకాలంలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు శరీర రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి.
ఫంగల్ ఇన్ఫెక్షన్లు
వర్షాకాలంలో అధిక తేమ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది, ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, దీని ఫలితంగా జ్వరం లక్షణంగా ఉండవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం