Life Style: స్నానం తర్వాత చెమట పడితే డేంజారా?

స్నానం చేసిన తర్వాత కొందరికి చెమట పట్టడం జరుగుతుంది. ఇలా ఎందుకు వస్తుంది? ఇది ఏదైనా అనారోగ్యానికి సంకేతమా?అనేది ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకోండి

author-image
By Archana
New Update
bathing1 (1)

Life Style: చాలా మందికి  స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత.. విపరీతమైన చెమట పట్టడం మొదలవుతుంది. ఇలా ఎందుకు అవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఒక సాధారణ పరిస్థితా? లేదా ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతమా? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. 

స్నానం చేసిన తర్వాత చెమట పట్టడానికి గల కారణాలు

వేడి నీటితో స్నానం చేయడం

నిజానికి, వేడి నీటిలో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతను నార్మల్ చేయడానికి శరీరం చెమటలు పట్టిస్తుంది. తద్వారా శరీరం నుంచి అదనపు వేడి బయటకు విడుదలవుతుంది. 

బాత్రూంలో తేమ

స్నానం చేసేటప్పుడు బాత్రూంలో సరైన వెంటిలేషన్ లేని పరిస్థితుల్లో అక్కడ పెరిగిన తేమ, వేడి కారణంగా చెమటలు పట్టే అవకాశం ఉంటుంది. 

హార్మోన్లు

కొంతమందికి వారి శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల (థైరాయిడ్ లేదా ఒత్తిడి వంటివి) స్నానం చేసిన తర్వాత ఎక్కువగా చెమట పట్టడానికి కారణమవుతాయి.

సున్నితమైన చర్మం

మరికొంతమందికి చాలా సున్నితమైన చర్మం ఉంటుంది. అలాంటి వ్యక్తుల్లో స్నానం చేసిన తర్వాత చర్మ రంధ్రాలు తెరుచుకోవడం వల్ల ఎక్కువగా చెమట పడుతుంది.

అధిక చెమటను ఎలా నివారించాలి

స్నానానికి చల్లని లేదా గోరువెచ్చని నీటిని వాడండి. అలాగే స్నానం చేసేటప్పుడు మంచి వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఆన్ చేయడం మంచిది. 

స్నానం చేసిన తర్వాత, శరీరాన్ని రుద్దకుండా మెల్లగా టవల్ తో ప్రెస్ చేస్తూ పూర్తిగా ఆరబెట్టండి. దీంతో పాటు స్నానం చేసిన వెంటనే బరువైన లేదా బిగుతుగా ఉండే దుస్తులు ధరించవద్దు. ఇలా కాకుండా మీకు సాధారణం కంటే చెమట పడుతుంటే మీ హార్మోన్ల స్థాయిలను వైద్యుడితో తనిఖీ చేయించుకోండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు