/rtv/media/media_files/2025/03/19/FZp9SPBz60i3V4bPCMSW.jpeg)
Life Style News: సాధారణంగా ఏడ్చిన తర్వాత చాలా మంది తలనొప్పికి గురవుతూ ఉంటారు. అసలు కన్నీళ్లకు తలనొప్పికి సంబంధం ఏంటి? ఏడ్చిన(crying) తర్వాత తలనొప్పి ఎందుకు వస్తుంది అనే విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
తలనొప్పి ఎందుకు వస్తుంది
ఒత్తిడి
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి ఏడ్చినప్పుడు, వ్యక్తి ఒత్తిడి, ఆందోళనను అనుభవిస్తాడు. దీని కారణంగా శరీరంలో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ విడుదల కావడం ప్రారంభమవుతుంది. దీని వల్ల మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లు ప్రేరేపించబడి తలనొప్పికి(headache) కారణమవుతుంది.
ఆక్సిజన్ అందకపోవడం
అలాగె ఏడ్చే సమయంలో శ్వాస రేటు పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ లోపించి తలనొప్పి సమస్యకు కారణం కావచ్చు .
ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Crying-is-good-helath-Benefits.jpg)
Also Read: USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు
రక్తనాళాలు సంకోచించడం
ఏడ్చేటప్పుడు రక్తనాళాలు సంకోచించడం ప్రారంభిస్తాయి. దీనివల్ల కూడా తలనొప్పి సమస్య తలెత్తుతుంది.
ఉపశమనం పొందే చిట్కాలు
నీరు తాగాలి
ఏడుపు తర్వాత తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి తగినంత నీరు తాగాలి. కొన్నిసార్లు డీహైడ్రేషన్ కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. ఏడ్చిన తర్వాత ఒక గ్లాసు నీరు లేదా ఎలక్ట్రోలైట్ పానీయం తాగడం ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
Horoscope: నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!
అల్లం టీ
అల్లం టీ కూడా తలనొప్పికి బాగా పనిచేస్తుంది. ఇది కండరాల ఒత్తిడిని తగ్గించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పికి ప్రయోజనకరంగా ఉంటుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Google Pixel 9a: వచ్చేసింది వచ్చేసింది.. కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!