GYM Tips: జిమ్ చేసేవారికి హెచ్చరిక! సేఫ్ గా ఉండాలంటే  ఈ 5 టెస్టులు తప్పనిసరి

ఇటీవలే కాలంలో  జిమ్ చేస్తూ హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న  వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది.  ఈ నేపథ్యంలో జిమ్ మొదలు పెట్టేముందు తప్పనిసరిగా కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు నిపుణులు.

New Update
Gym

Gym

GYM Tips: ఈ మధ్య ప్రతి ఒక్కరు ఫిట్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇష్టపడడమే కాదు ఫిట్ గా ఉండడం అనేది ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారిపోయింది. యువతీ, యువకులు, పెద్ద, చిన్నా అని తేడా లేకుండా జిమ్ ల వెంట పరుగెడుతున్నారు. శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి గంటల తరబడి జిమ్ లో కష్టపడుతున్నారు. 

అయితే దురదృష్టవశాత్తు  ఈ ఇటీవలే కాలంలో  జిమ్ చేస్తూ హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న  వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది.  ఇలాంటి సంఘటనలు అందరినీ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. సరైన హెల్త్ చెకప్స్  లేకపోవడం,   పాస్ట్ హిస్టరీ తెలుసుకోకుండా జిమ్ కఠినమైన వ్యాయామాలు చేయడం ఇలాంటి ప్రమాదాలను ప్రధాన కారణమని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో జిమ్ మొదలు పెట్టేముందు తప్పనిసరిగా కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఈ పరీక్షలు మీ శరీరం ఫిట్ గా ఉందా? లేదా?, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అనే విషయాన్ని  తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. 

ఏ పరీక్షలు చేయించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.. 

ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG)

జిమ్ చేసేటప్పుడు గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉన్నందున.. గుండె పనితీరును అంచనా వేయడానికి ఈ పరీక్ష చాలా  ముఖ్యమైనది. ECG మీ గుండె స్పందన, రిథమ్,  బ్లడ్ ప్రెజర్ ని కొలుస్తుంది. అలాగే గుండె సరిగ్గా పనిచేస్తుందో లేదో దీని ద్వారా తెలుసుకోవచ్చు.  ఇవన్నీ సరైన స్థితిలో లేకుండా జిమ్ హెవీ వర్కౌట్స్ చేయడం గుండెపోటు ప్రమాదాలకు కారణం కావచ్చు. 

లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్

ఈ పరీక్ష మీ రక్తంలో కొలెస్ట్రాల్,  ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను కొలుస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉందో లేదో దీని ద్వారా తెలుసుకోవచ్చు. అధిక కొలెస్ట్రాల్ గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కావున జిమ్ మొదలు పెట్టే ముందు ఈ టెస్ట్ కూడా చేయించుకోండి. 

లివర్ ఫంక్షన్ టెస్ట్ 

LFT లివర్ ఫంక్షన్ టెస్ట్  మీ కాలేయం పనితీరును తెలియజేస్తుంది. కాలేయంలో ఏదైనా  వాపు, ఇన్ఫెక్షన్ లేదా ఇతర వ్యాధులు ఉన్నాయా అనేది  ఈ టెస్ట్  ద్వారా నిర్ధారించవచ్చు. జిమ్ చేసేటప్పుడు కాలేయం పనితీరు చాలా ముఖ్యం. వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలు కాలేయం పై ఒత్తిడిని కలిగిస్తాయి. కావున ఈ డిమాండ్లకు అనుగుణంగా కాలేయం పనితీరు మెరుగ్గా ఉండాలి. అలాగే శరీరానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేయడానికి, జీవక్రియ పనితీరును మెలుగుపరచడంలో కాలేయం 
కీలక పాత్ర పోషిస్తుంది, 

కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ 

KFT టెస్ట్  మీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. మూత్రపిండాలలో రాళ్లు, వాపు  ఉన్నాయా అనే విషయాన్నీ కనిపెట్టవచ్చు. అలాగే కిడ్నీలు రక్తాన్ని సరిగ్గా చేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి  కూడా ఈ పరీక్ష సహాయపడుతుంది.

జిమ్ చేసేటప్పుడు కిడ్నీ పనితీరు చాలా ముఖ్యమైనది ఎందుకంటే.. ఇవి శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ నిర్వహించడంతో పాటు వ్యర్థాలను ఫిల్టర్ చేస్తాయి. అలాగే ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమయ్యే ఎరిత్రోప్రోటీన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తాయి. 

థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ 

థైరాయిడ్ గ్రంథి శరీర పెరుగుదల, శక్తి స్థాయిలు,  హార్మోన్ల సమతుల్యతను నియంత్రిస్తుంది. ఈ పరీక్ష థైరాయిడ్ పనితీరులో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే విషయాన్ని తెలియజేస్తుంది. .థైరాయిడ్ సమస్యలు ఉంటే బరువు పెరగడం, అలసట వంటి లక్షణాలు ఉంటాయి. కావున జిమ్ కి వెళ్లే ముందు ఈ టెస్ట్ చేయించుకోవడం మంచిది.  

జిమ్ కి వెళ్లేవారు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇది మీ ఆరోగ్యంపై మీకు ఒక అవగాహనను కల్పిస్తుంది. అలాగే ఏవైనా సమస్యలు ఉంటే  ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడానికి  సహాయపడుతుంది. 

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Advertisment
తాజా కథనాలు