Life Style: మధుమేహం ఉంటే చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు

చెరుకు రసం తియ్యగా ఉండడం ద్వారా మధుమేహ రోగులు దీనిని తీసుకోవచ్చా? లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇతర తీపి పదార్థాల మాదిరిగానే చెరుకు రసం కూడా మధుమేహ రోగులకు హానికరం. దీని ద్వారా రక్తంలో చక్కర స్థాయిలు వేగంగా పెరిగే ప్రమాదం ఉంది.

New Update
sugarcane juice health

sugarcane juice health

Life Style: చెరుకు రసంలో యాంటీఆక్సిడెంట్లతో పాటు అనేక ఇతర పోషకాలు  పుష్కలంగా  ఉంటాయి.  ఇది మూత్రపిండాలు మరియు కాలేయ సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయితే చెరుకు రసం తియ్యగా ఉండడం ద్వారా మధుమేహ రోగులు దీనిని తీసుకోవచ్చా? లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.  దీనిపై నిపుణులు ఏమి చెబుతున్నారో ఇక్కడ తెలుసుకోండి. 

ఇది కూడా చూడండి: Hibiscus: ఇది పువ్వు మాత్రమే కాదు.. మందారం ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు!

డయాబెటిస్ ఉన్నవారికి మంచిదా?

చెరకు సహజమైన చక్కెరలను కలిగి ఉంటుంది. కావున డయాబెటిస్‌తో బాధపడుతున్నప్పటికీ దీనిని తీసుకోవచ్చని అనుకుంటారు. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇతర తీపి పదార్థాల మాదిరిగానే చెరుకు రసం కూడా మధుమేహ రోగులకు హానికరం. దీనిని తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కర స్థాయిలు వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. నిజానికి రసం తాగడం వల్ల పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు విడుదలవుతాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తికి  తోడ్పడతాయి. అయినప్పటికీ మధుమేహ రోగులు దీనిని తీసుకునేముందు వైద్యుడిని సంప్రదించాలి. 

ఇది కూడా చూడండి:Return Of The Dragon: ఓటీటీలోకి 'డ్రాగన్' ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

చెరకు రసంతో కలిగే ప్రయోజనాలు

వేసవిలో వేడి దెబ్బ, డీహైడ్రేషన్  నివారించడానికి చెరకు రసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  చెరకు రసంలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక గ్లాసు తాజా చెరకు రసం తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇది సహజమైన పానీయం అయినప్పటికీ పరిమిత మోతాదులో తీసుకుంటేనే ప్రయోజనకరం. 

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి:Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

Advertisment
తాజా కథనాలు