life style: ఫ్రిడ్జ్ లో ప్లాస్టిక్ బాటిళ్లను పెట్టేవారికి షాకింగ్ న్యూస్!

ఫ్రిజ్‌లో వాడే ప్లాస్టిక్ బాటిళ్లను తరచూ మారుస్తూ ఉండాలి. లేదంటే ఆరోగ్యానికి హానికరం. ఒకే బాటిల్ ని ఎక్కువ కాలం వాడడం ద్వారా.. వాటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే ప్లాస్టిక్.. దాని రసాయనాలను మెల్లిగా  నీటిలోకి లీక్ చేయడం ప్రారంభిస్తుంది.

New Update
plastic bottles in fridge

plastic bottles in fridge

life style: ఈ మధ్య ప్లాస్టిక్ బాటిళ్ళ వాడకం విపరీతంగా పెరిగిపోయింది.  సీసాతో తయారు చేసిన అనేక  రకాల వాటర్ బాటిళ్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నప్పటికీ.. చాలా మంది ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టేందుకు ప్లాస్టిక్ బాటిళ్లనే ఎక్కువగా వాడుతుంటారు. సీసా బాటిళ్ళు అయితే పగిలిపోతాయని , ప్లాస్టిక్ వి చౌకగా లభిస్తాయని.. ఇలా అనేక కారణాల చేత ప్లాస్టిక్ బాటిళ్ల పై మొగ్గు చూపుతారు. అయితే ఇలా ప్లాస్టిక్ బాటిళ్లను వాడేవారు కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి. లేదంటే ఆరోగ్యానికే హానికరం. 

ఫ్రిజ్‌లోని ప్లాస్టిక్ బాటిళ్లను తరచూ మారుస్తూ ఉండాలి. ఒకే బాటిల్ ని ఎక్కువ కాలం వాడడం ద్వారా.. వాటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే ప్లాస్టిక్.. దాని రసాయనాలను మెల్లిగా  నీటిలోకి లీక్ చేయడం ప్రారంభిస్తుంది. ఇలాంటి నీటిని తాగడం ద్వారా అనేక రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. 

ఎన్ని రోజులకు మార్చాలి.. 

ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అరిగిపోయినట్లుగా కనిపించడం, దాని నుంచి దుర్వాసన రావడం వంటివి గమనించినప్పుడు వెంటనే మార్చాలి. ఇలాంటి సమస్యలేమీ లేకపోయినా.. 6 నెలల్లోపు మార్చాలి. మంచి నాణ్యత కలిగిన ప్లాస్టిక్ అయితే  దానిని 12 నెలల వరకు  ఉపయోగించవచ్చు.  గ్లాస్ వాటర్ బాటిల్ ఉపయోగిస్తుంటే, ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి దాన్ని మార్చవచ్చు. స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మార్చవచ్చు. ఇలా చేయడం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.  అంతేకాదు  సీసాల పరిశుభ్రత కోసం వాటిని ప్రతిరోజూ వేడి నీరు , సబ్బుతో శుభ్రం చేయాలి. 

plastic-bottles | life-style 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: SIKANDAR Trailer: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు