/rtv/media/media_files/2025/02/15/0q3mCyxo08QoeG09kEV9.jpg)
brushing teeth
Tooth Brush: ఒకప్పుడు నిద్రలేవగానే.. అప్పుడే చెట్టు నుంచి విరిచిన వేప పుల్లతో పళ్ళు శుభ్రంగా తోముకునేవారు. వేపపుల్ల పళ్ళను శుభ్రంగా ఉంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెబుతారు పూర్వికులు. కానీ ఇప్పుడు పళ్ళు తోముకోవడానికి మార్కెట్లలో రకరకాల బ్రష్ లు వచ్చాయి. హార్డ్, మీడియం, సాఫ్ట్ బ్రిజిల్స్ అంటూ అనేక రకాలు ఉన్నాయి. వీటిలో చాలా మంది పళ్ళు తెల్లగా అవ్వాలని, పట్టిన గార వదలాలని హార్డ్ బ్రష్ తో తోముతుంటారు.
Also Read:Prabhas Spirit Casting Call: డార్లింగ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆ సినిమాలో నటించే అవకాశం..!
ఈ చెత్త బ్రష్ ఇంకా వాడుతున్నారా? ఇప్పుడే ఆపేయండి #trendingreels #dentistry #viralreels #viralvideos #trend #dentist #nellore #happydentalnellore #dentalhealth #education #dentaleducation
Posted by Happy Dental Hospital on Friday, February 14, 2025
అలాంటి బ్రష్ లను వాడొద్దు
అయితే హార్డ్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్ లను ఉపయోగించడం ద్వారా ఉండే పళ్ళు అరిగిపోవడం తప్పా ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు వైద్యులు. సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్ లను వాడడం మంచిదని సూచిస్తున్నారు. ఇవి పళ్లలోని సందుల్లోకి ఈజీగా వెళ్లి.. నోటిని శుభ్రంగా ఉంచుతాయి. అదే హార్డ్ బ్రిసిల్స్ కలిగిన బ్రష్ వాడడం ద్వారా పళ్ళ సందుల్లోని మురికి అలాగే ఉండిపోతుంది. అందుకే సాఫ్ట్ బ్రష్ లను ఎంపిక చేసుకోవడం మంచిది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Malayalam Film Industry: మలయాళం ఇండస్ట్రీలో అన్నీ బంద్.. జూన్ 1 నుంచి ఏం జరగబోతుందంటే?