Hair Fall Tips : ఈ మధ్య చాలా మందిలో సహజంగా కనిపిస్తున్న సమస్య జుట్టు రాలడం. శరీరంలో పోషకాహారం లోపం, జీవన శైలి, పర్యావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల జుట్టు రాలడం మొదలవుతుంది. అయితే రోజూ వారి డైట్ లో కొన్ని విత్తనాలను చేర్చుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను అధికమించవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ విత్తనాలు జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా జుట్టును బలంగా తయారు చేస్తాయి.
జుట్టు పెరుగుదలకు సహాపడే విత్తనాలు
నల్ల నువ్వులు
నల్ల నువ్వులను ఆహారంలో తీసుకోవడం ద్వారా అకాల జుట్టు మెరుపును నివారించడానికి సహాయపడుతుంది. దీనిలోని ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ జుట్టుకు పోషణను అందిస్తాయి. జుట్టును బలోపేతం చేయడంతో పాటు.. జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తాయి.
చియా సీడ్స్
చియా విత్తనాలు జుట్టు పెరుగుదలకు ఔషధంగా పరిగణించబడతాయి. ఈ గింజల్లోని యాంటీ యాక్సిడెంట్స్ ఆక్షీకరణ ఒత్తిడిని తగ్గించి.. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ జుట్టును బలోపేతం చేస్తాయి. చియా విత్తనాలను పెరుగు, స్మూతీలో వంటి వాటిలో కలిపి తినవచ్చు.
గుమ్మడికాయ
సాధారణంగా చాలా మంది గుమ్మడికాయలోని విత్తనాలను బయట పడేస్తుంటారు. కానీ ఈ గుమ్మడికాయ గింజల్లో జుట్టు ఆరోగ్యానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజల్లోని జింక్ తలలో నూనెను ఉత్పత్తి చేసే గ్రంధులను ప్రేరేపించి జుట్టును రిపేర్ చేయడంతో పాటు పెరుగుదలకు సహాయపడుతుంది. దీనిలోని మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్లు జుట్టును విరగకుండా చేయడంలో తోడ్పడతాయి.
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Dry Fruits నానబెట్టే ఎందుకు తింటారు..?