/rtv/media/media_files/2025/02/08/msytypSnLJH2mnbSLd1N.jpg)
ఆందోళన
మహిళలు తరచుగా భవిష్యత్తు గురించి ఇల్లు, భర్త, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటారు. దీనివల్ల శరీరంలో ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి చర్మం వేగంగా వృద్ధాప్యానికి కారణమవుతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/stress-jpg.webp)
కోపం, చిరాకు
కోపం, చిరాకును వీలైనంత వరకు నియంత్రించుకోవాలి. ఇది మానసిక, శారీరక ఆరోగ్యం రెండింటినీ దెబ్బతీస్తుంది. కోపం చిరాకు వంటి ప్రతికూల భావోద్వేగాలు చర్మం, జుట్టుపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల వయస్సు కంటే ముందుగానే వృద్ధులుగా కనిపించడం ప్రారంభిస్తారు.
/rtv/media/media_files/2025/02/08/dycE8rB7HRFwz2KpVuSL.jpg)
సరైన వ్యాయామం
సాధారణంగా మహిళలు రోజంతా ఇంట్లో పనిచేయడం వల్ల వ్యాయామం అవసరం లేదని అనుకుంటారు. కానీ అది తప్పు. ప్రతి శరీరానికి రోజూ కొంతసమయం వ్యాయామం తప్పనిసరి అవసరం. ప్రతి రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఎముకలు, కండరాళ్ళు బలంగా ఉంటాయి. తద్వారా వ్యక్తి ఎల్లప్పుడూ ఫిట్ గా ఉంటారు.
/rtv/media/media_files/exercise7.jpeg)
తక్కువ నిద్రపోవడం
రోజుకు 7- నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి. సమయానికి నిద్రపోకపోవడం, రాత్రుళ్ళు గంటలు తరబడి ఫోన్లు చూడడం చర్మం పై త్వరగా వృద్ధాప్య ఛాయలకు కారణమవుతుంది. సరైన నిద్ర శరీరం తనను తాను మరమ్మతు చేసుకోవడానికి సహాయపడుతుంది.
/rtv/media/media_files/2024/11/23/7VvfM3yv0S9CxM97NXHi.jpg)
తక్కువ నీరు
చాలా మంది మహిళలు పనుల్లో బిజీగా ఉండిపోయి సరిగ్గా నీళ్లు తాగగకపోవడం చేస్తుంటారు. నీళ్లు తక్కువగా తాగడం చర్మం, జుట్టుపై చెడు ప్రభావం చూపుతుంది. అదే సమయంలో ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి.
/rtv/media/media_files/2025/01/04/water8.jpeg)
ఆరోగ్యమైన చర్మం కోసం సరైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి విధానాలను తప్పనిసరిగా పాటించాలి. లేదంటే యవ్వన వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపించే అవకాశం ఉంటుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/beauty-tips-Black-pimples-on-face-can-be-reduced-by-following-home-remedies.jpg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Li