/rtv/media/media_files/2025/01/19/lGkjQ2NPh5bbWfOJNKbv.jpg)
five places gate ways to hell
Life Style: ప్రపంచంలోని ఈ ఐదు ప్రదేశాలను నరకానికి ద్వారాలుగా చెబుతారు. ఈ ప్రదేశాల్లోని అద్భుతమైన శక్తులు, రహస్యమైన అంశాల కారణంగా ఇవి 'గేట్ టు హెల్'గా ప్రసిద్ధి చెందాయి. వీటి మిస్టరీ శాస్త్రవేత్తలకు కూడా పజిల్‌గానే మిగిలిపోయింది. నరకానికి మార్గంగా చెప్పబడే కొన్ని ఈ ప్రదేశాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
గెహెన్నా
పురాతన జెరూసలేం లోపల ఉన్న గెహెన్నా అనే లోయను నరకానికి ద్వారంగా చెబుతారు. పురాతన కాలంలో ఈ ప్రదేశం అమ్మోనైట్ మతస్థుల దేవుడైన మోలోచ్‌ను శాంతింపజేయడానికి పిల్లలను బలి ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఈ లోయలో మృతదేహాలను కాల్చే ఆచారం జుడాయిజం, క్రిస్టియానిటీలో 'హెల్ ఫైర్' అనే భావనకు దారితీసింది. మరణం తరువాత, గౌరవప్రదమైన అంత్యక్రియలు జరగని వారి ఆత్మలు ఈ ప్రదేశంలో విసిరివేయబడతాయని నమ్ముతారు.
ప్లూటోస్ గేట్
టర్కీలోని పురాతన గ్రీకు నగరమైన హిరాపోలిస్‌లో 'ప్లూటోస్ గేట్' అని పిలువబడే ఒక గుహ ఉంటుంది. జంతువులు, పక్షులు ఇలా ఏవైనా ఈ గుహలో ప్రవేశించిన వెంటనే చనిపోతాయట. ఇది విషపూరితమైన కార్బన్ డై ఆక్సైడ్ వాయువు నిండి ఉంటుందని, ఇది జంతువులు మరియు చిన్న పక్షులను చంపుతుందని సైన్స్ నిరూపించింది. ఈ ప్రదేశం ఒక రకమైన "గ్యాస్ చాంబర్" లాంటిది. అందుకే దీనిని "డోర్ టు హెల్" అని పిలుస్తారు.
హెక్లా అగ్నిపర్వతం
ఐస్లాండ్ లోని హెక్లా అగ్నిపర్వతం. పురాతన కాలం నుంచి ఇది "నరకం గేట్వే" గా పరిగణించబడుతుంది. 1104లో దీని విస్ఫోటనం సగభాగం ఐస్లాండ్ ను బూడిద, రాళ్లతో కమ్మేసింది. అందుకే యూరోపియన్లు దీనిని నరకానికి ద్వారంగా పిలుస్తారు.
రాతి సమాధి ఆక్టున్ తునిచిల్ ముక్నాల్
బెలిజ్‌లోని ఈ గుహను 'కేవ్ ఆఫ్ స్టోన్ సమాధి' (యాక్టున్ తునిచిల్ ముక్నాల్) అని పిలుస్తారు. మాయా నాగరికత ప్రకారం, ఇది 'జిబల్బా' అనే పాతాళానికి ప్రవేశ ద్వారం. 4 సంవత్సరాల పిల్లలతో సహా అనేక మంది బలిదానాల అస్థిపంజరాలు ఇక్కడ కనుగొనబడ్డాయి.
సెయింట్ పాట్రిక్స్
ఐర్లాండ్‌లోని లాగ్ డుగ్నే (Lough Derg) వద్ద ఉన్న ఒక పవిత్రమైన మత స్థలం. పురాతన కాలంలో ప్రజలు తమ పాపాలను శుద్ధి చేసుకోవడానికి పోతారని కథనాలు ఉన్నాయి. ఇక్కడకు ప్రవేశించిన వ్యక్తులు తమ పాపాలను శుద్ధి చేసుకోవడానికి అనేక శిక్షలు, ఇబ్బందులను అనుభవిస్తారట. అందుకే దీనిని నరక ద్వారంగా చెబుతారట.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.