Leather Watch: వాచ్ బెల్ట్ ను ఎలా తయారు చేస్తారో తెలుసా? మార్కెట్లో రకరకాల కంపెనీల వాచ్‌లు ఉంటాయి. వాటిల్లో కొందరు లెదర్ బెల్ట్ కలిగిన వాచ్‌లను ఇష్టపడతారు. ఫుల్‌గ్రెయిన్, కాఫ్‌స్కిన్, ఎలిగేటర్, స్వెడ్ లెదర్ వంటివి జంతువుల చర్మంతో చేస్తారు. పైనాపిల్ లెదర్ చాలా ఫేమస్. By Vijaya Nimma 15 Sep 2024 in లైఫ్ స్టైల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Leather Watch: ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ వస్తువులకు ఎంతో డిమాండ్ ఉంది. చిన్నల నుంచి పెద్దల వరకు ఏ కొత్త ఫ్యాషన్ బట్టలు, వస్తువులు వచ్చినా కచ్చితంగా వాటిని ఇష్టపడతారు. అంతేకాదు.. ఎంత ఖరీదైన కొనుక్కోవడానికి వెనకడుగు వేయరు ఈ కాలం జనరేషన్ మనుషులు. అయితే మనం ఎంత ఖరీదైన ఫ్యాషన్ వస్తువులు ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నా వాటి విలువలు మాత్రం చాలామందికి తెలవదు. అవి ఎలా వచ్చాయి..? వాటివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి..? అసలు పెట్టుకోవచ్చా..? లేదా..? అనే విషయాలను కూడా కొందరు పట్టించుకోరు. అలాంటి వాటిలో వాచ్ ఒకటి. వాచ్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఉపయోగపడే ఒక వస్తువు. వాటిల్లో కొందరు బ్రాండ్‌ని ఇష్టపడితే.. మరికొందరు లెదర్ బ్రాండ్ ఉన్న వాచ్‌లను ఇష్టపడతారు. అయితే ఈ లెదర్ బ్రాండ్ వాచ్‌లు వివిధ రకాలుగా ఉంటాయి. అన్ని ఒకేలా ఉన్నా కానీ వాటి మధ్య తేడాలుంటాయి. లెదర్ వాచ్‌లు ఎక్కువగా జంతువుల చర్మాలతో తయారు చేస్తారట. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. లెదర్ వాచ్‌లు తయారు చేసే విధానం: ఫుల్ గ్రెయిన్ లెదర్: ఇది కంగారు ఆవు చర్మంతో తయారు చేస్తారు. దీనిని ఈ జంతుల వెంట్రుకల క్రింద చర్మంతో తయారు చేస్తారు. అయితే ఇవి మన్నికగా, బలంగా ఉంటాయి. ప్రాసెసింగ్ చేసే టైంలో జుట్టు తీసివేసి తోలు నుంచి చేస్తారు. ఈ తోటు చెమట, తేమను నిరోధిస్తుందట. కాఫ్ స్కిన్ లెదర్: ఈ రకమైన తోలుకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇది దూడ చర్మంతో తయారు చేస్తారు. దీనితో చేసే వాచ్‌లు మృదువైన, చక్కటి ఆకృతి ఉంటుంది. అందుకే ఇదీతో చేసిన వాచ్‌లు చేతికి పెట్టుకున్న హాయిగా ఉంటాయి. దీని నాణ్యత వల్ల ధర ఎక్కువగా ఉంటుంది. ఎలిగేటర్ లెదర్: ఇది మొసలి చర్మంతో తయారు చేస్తారు. అంతేకాదు జంతువుల తోలు కంటే మొసలి చర్మం పటిష్టంగా ఉంటుంది. బ్రాండ్ లేదర్ వాచ్‌లతో పాటు వివిధ రకాలైన ఫ్యాష్యన్ వస్తువులను తయారు చేస్తారు. స్వెడ్ లెదర్: ఇది గొర్రె చర్మంతో తయారు. ఈ తోలు చాలా మృదువు ఉంటుంది. ఇది మేక, పంది, దూడ, జింకల జంతు చర్మాల దిగువ నుంచి తీసిన ప్రత్యేక రకం తోలు కూడా లెదర్‌కి ఉపయోగిస్తారు. దీనిని మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ. పైనాపిల్ లెదర్: పైనాపిల్ లెదర్ చాలా ఫేమస్. ఈ ప్రత్యేకమైన తోలును పైనాపిల్ మొక్క ఆకుల నుంచి తయారు చేస్తారు. పైనాపిల్ పైనాపిల్ ఆకుల్లో తోలు లాంటి పదార్థమై పినాటెక్స్ అనే ప్రత్యేక ఫైబర్ ఉంటుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #lifestyle మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి