అసలు జీవులకు మరణం ఎందుకు అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. చావును జయించడం సైన్స్‌తో సాధ్యమేనా అనే సందేహం మరికొందరిలో నెలకొంది. పుట్టినప్పుడు మనిషి.. మిగతా జీవులకంటే నిస్సహాయుడు.పెరిగే కొద్దీ తన ఉనికిని నిరూపించుకోవాలనే ఆరాట గుణం మనిషికి ఎక్కువైంది. వ్యక్తికి ఊహ తెలిసినప్పటి నుంచి.. తాను టాప్‌లో ఉండాలనే కసి మొదలవుతుంది.
Also Read : వామ్మో.. 'పుష్ప 2' ను అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారా?
ఆస్తి, అధికారం లాంటి మార్గాలతో ఈగో ప్రారంభమవుతోంది. అందుకే మన పురాణాల్లో సైతం అమరత్వం ఓ కీలక పాత్ర పోషించింది. మరణం తన జోలికి రాకూడదని రాక్షసులు వరాలు కోరుకునేవారు. నిన్నమొన్నటి వరకూ ఈ ప్రయత్నం మానవమాత్రులకు అసాధ్యం అనుకునేవారు. కానీ కొన్ని పరిశోధనలు, సంఘటనలు పరిశీలించాక మనిషి చిరంజీవిగా మారగలడనే ఆశలు చిగురిస్తున్నాయి.