అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్.. ఏపీ హైకోర్టులో కేసు కొట్టివేత! స్టార్ హీరో అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ ఎన్నికల ప్రచార టైంలో 144 సెక్షన్ ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేస్తున్నట్లు .. నేడు ధర్మాసనం తీర్పునిచ్చింది. By Archana 06 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update allu arjun షేర్ చేయండి Allu arjun: ఏపీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఊరట లభించింది. నంద్యాల పోలీసులు బన్నీ పై నమోదు చేసిన కేసును కొట్టివేస్తున్నట్లు.. నేడు ఆంద్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం ప్రచారం అయితే నటుడు అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం ప్రచారం చేసిన క్రమంలో.. 144 సెక్షన్ అమల్లో ఉండగా జనసమీకరణ చేశారంటూ బన్నీ పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బన్నీ పిటీషన్ స్వీకరించి గత నెల 25న విచారణ జరిపిన ధర్మాసనం.. నవంబర్ 6కు తుది తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నేడు ఫైనల్ హియరింగ్ జరగగా.. బన్నీ పై నంద్యాల పోలీసులు నమోదు చేసిన కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ఏపీ ఎన్నికల్లో శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేయడం మెగా ఫ్యామిలీలో చిచ్చు రేపింది. అప్పటి నుంచి ఈ ఇరు కుటుంబాలలో మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ను దూరం పెట్టారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. Also Read: చిరు, నాగ్, వెంకీలో నాకు ఇష్టమైన హీరో అతనే.. బాలయ్య భలే చెప్పాడుగా! పుష్ప 2 ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏకంగా 11,500 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతూ.. ఇండియాన్ సినిమాలో బిగ్గెస్ట్ రిలీజ్ గా రికార్డు సృష్టించనుంది. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో రష్మిక ఫిమేల్ లీడ్ గా నటించగా.. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందించారు. Also Read: సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి