Exercise: డెలివరీ తర్వాత ఎన్నిరోజులకు వ్యాయామం చేయొచ్చు?

మహిళలు డెలివరీ తర్వాత శరీరాన్ని ఫిట్‌, మంచి ఆకృతిలో ఉంచుకోవడానికి వ్యాయామం ఉపయోగపడుతుంది. అయితే డెలివరీ తర్వాత కొంత కాలం దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. రెండు వారాల తర్వాత డాక్టర్ సూచనతో చిన్న చిన్న వ్యాయామాలు ప్రారంభించాలని చెబుతున్నారు.

exercise
New Update

గర్భందాల్చినప్పుడు మహిళలు శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నిజానికి గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. వారి బరువు పెరుగుతుంది, అనేక ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చు. డెలివరీ తర్వాత ఫిట్‌నెట్‌ కోసం ఆహారం, వ్యాయామం ఉత్తమ ఎంపికలు. నార్మల్ లేదా సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత కనీసం 6 వారాల పాటు వ్యాయామం చేయాలని కొందరు గైనకాలజిస్టులు చెబుతున్నారు. కాకపోతే భారీ వర్కౌట్స్‌ తగ్గిస్తే బెటర్‌ అని వారు సలహాలు ఇస్తున్నారు.

కొన్ని మాత్రమే చేయాలి:

  • సాధారణ లేదా సిజేరియన్ డెలివరీ తర్వాత స్త్రీ శరీరం చాలా బలహీనంగా మారుతుంది. దీని ప్రభావం కడుపు, తుంటిపై కనిపిస్తుంది. ఇది కనీసం 40-45 రోజుల తర్వాత మాత్రమే క్రమంగా బలంగా మారుతుంది. దీని తర్వాత మాత్రమే కొన్ని రకాల వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయినప్పటికీ, డెలివరీ అయిన రెండు వారాల తర్వాత మహిళలు తేలికపాటి కెగెల్స్ వ్యాయామాలు చేయవచ్చని చెబుతున్నారు. ఏదైనా వ్యాయామం చేసేముందు వైద్యుడిని సంప్రదించాలని స్పష్టం చేస్తున్నారు.

వ్యాయామానికి ముందు ఏం చేయాలి?

  • ప్రసవం అయిన రెండు వారాల్లోనే నడక వంటి తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. తేలికపాటి యోగాసనాలు, ప్రాణాయామం చేయవచ్చని సూచిస్తున్నారు. అయితే వ్యాయామం ప్రారంభించే ముందు నిపుణుడు లేదా వైద్యుడితో చర్చించడం చాలా ముఖ్యమని వివరిస్తున్నారు. వారి సలహా తర్వాతే సరైన సమయంలో వ్యాయామం ప్రారంభించాలని చెబుతున్నారు. అంతేకాకుండా తగిన మొత్తంలో నీరు తీసుకోవడం కూడా శరీరానికి మేలు చేస్తుందని సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#exercise
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe