Navratri 2025: అష్టదరిద్రం వద్దనుకుంటే నవరాత్రుల్లో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.!

నవరాత్రుల సమయంలో కొన్ని అశుభకరమైన వస్తువులను ఇంటి నుంచి తొలగించడం ద్వారా దుర్గాదేవి ఆశీస్సులు లభించి.. ఇంట్లో సానుకూలత, సంపద, శ్రేయస్సు పెరుగుతాయి. అందుకే పండుగకు ముందు ఇంట్లో తీయాల్సిన 5 వస్తువుల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.

New Update
Navratri 2025

Navratri 2025

నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని నవదుర్గ రూపాల్లో భక్తులు కొలుస్తారు. మొదటి రోజు కలశ స్థాపనతో ఈ పండుగ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30న మహా అష్టమి, అక్టోబర్ 1న మహా నవమి, అక్టోబర్ 2న విజయదశమి జరుపుకుంటారు. అదే రోజు దుర్గా ప్రతిమల నిమజ్జనం జరుగుతుంది. జ్యోతిష్యుల ప్రకారం.. ఈ నవరాత్రుల సమయంలో కొన్ని అశుభకరమైన వస్తువులను ఇంటి నుంచి తొలగించడం ద్వారా దుర్గాదేవి ఆశీస్సులు లభించి.. ఇంట్లో సానుకూలత, సంపద, శ్రేయస్సు పెరుగుతాయి. అందుకే పండుగకు ముందు ఇంటిని శుభ్రం చేసుకోవడం ఒక సంప్రదాయం. దేవతలను స్వాగతించడానికి ఇది చాలా ముఖ్యం. నవరాత్రి ఉత్సవాల్లో ఇంట్లో ఉండకూడని 5 వస్తువుల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

నిలిచిపోయిన గడియారం:

ఆగిపోయిన గడియారం రాహువు ప్రభావాన్ని పెంచుతుందని.. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని నమ్ముతారు. ఇది దుర్గాదేవికి ఆగ్రహం కలిగిస్తుంది. కాబట్టి దీన్ని రిపేరు చేయించాలి లేదా పండుగకు ముందే తీసివేయాలని పండితులు చెబుతున్నారు.

ఎండిన తులసి మొక్క:

తులసి మొక్క లక్ష్మీదేవికి చిహ్నం. ఎండిన తులసి ప్రతికూలతను వ్యాపింపజేస్తుంది. ఇది విష్ణువు, దుర్గాదేవిలకు నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు.

విరిగిపోయిన విగ్రహాలు, దెబ్బతిన్న చిత్రాలు:

దేవుళ్ల విరిగిపోయిన విగ్రహాలు లేదా దెబ్బతిన్న చిత్రాలు అశుభకరంగా  చెబుతారు.  వీటిని తొలగించడం వల్ల దైవిక ఆశీస్సులు, సానుకూలత ఇంట్లోకి వస్తాయి.

పగిలిన చీపురు:

చీపురు లక్ష్మీదేవికి చిహ్నం. విరిగిపోయిన చీపురు వాస్తు దోషాలను, ప్రతికూలతను తెస్తుంది. సంపద, సామరస్యం కోసం నవరాత్రులకు ముందు కొత్త చీపురును ఉపయోగించడం మంచిది.

నవరాత్రులు కేవలం పండుగ మాత్రమే కాదు. ఇది ఆధ్యాత్మికతను, ప్రకృతిని గౌరవించే సంస్కృతి. ఉపవాసాలు, పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సమయంలో నిర్వహిస్తారు. ఇది మనస్సుకు, శరీరానికి శాంతిని ఇస్తుంది. మహిషాసురుడిపై దుర్గాదేవి సాధించిన విజయాన్ని నవరాత్రి గుర్తు చేస్తుంది. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ పండుగ మనల్ని అంతర్గతంగా బలోపేతం చేసి.. జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనే శక్తినిస్తుంది. తొమ్మిది రోజులు దుర్గాదేవి వివిధ రూపాలను పూజించే ఈ పండుగ ఒక గొప్ప సంప్రదాయమని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: గర్భధారణ సమయంలో ఈ ఆహారం తల్లి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం

Advertisment
తాజా కథనాలు