ఈ 5 పదార్థాలను డైట్‌లో చేర్చుకుంటే.. ఆరోగ్యం మీ సొంతం అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్థాలను డైలీ డైట్‌లో చేర్చుకోవాలి. ముఖ్యంగా నిమ్మకాయ, బాదం, అల్లం, వెల్లుల్లి, తాజా పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. By Kusuma 25 Sep 2024 in లైఫ్ స్టైల్ Short News New Update షేర్ చేయండి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పదార్థాలను డైలీ డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. నిమ్మకాయ నిమ్మకాయ వాటర్ తాగడం, కూరల్లో వాడటం వల్ల అలసట, నీరసం తొలగిపోతాయి. ఇందులోని విటమిన్ సి వల్ల శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. బాదం బాదంలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డైలీ వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అల్లం ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటంతో అల్లం బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. వెల్లుల్లి రోజూ పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. తాజా పండ్లు సీజనల్‌గా లభ్యమయ్యే ఆరెంజ్, ద్రాక్ష, బెర్రీస్, యాపిల్ వంటి తాజా పండ్లను తింటే ఆరోగ్యంగా ఉంటారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి