ప్రతిరోజూ స్నానం చేయడం, ఇంటిని శుభ్రం చేయడం మాదిరిగానే, బెడ్ షీట్లను మార్చడం కూడా అంతే అవసరం అంటున్నారు నిపుణులు. బాగానే ఉన్నాయి కదా అని నిర్లక్ష్యం వహిస్తే మాత్రం అనారోగ్య సమస్యలకు గురికాక తప్పదు.
ఇది కూడా చదవండి: Massage: పొత్తి కడుపుకి మసాజ్ చేస్తే కలిగే లాభాలు
వారానికి ఒక సారి మార్చాల్సిందే..
వారానికి ఒకసారి బెడ్ షీట్లను మార్చాలి, ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువ చెమట పట్టేవారు, అలెర్జీ సమస్యలు ఉన్నవారు, పెంపుడు జంతువులతో నిద్రపోయేవారు, ప్రతి వారం మార్చడం తప్పనిసరి. బెడ్ షీట్లలో పేరుకుపోయిన దుమ్ము, శరీరంపై చెమట.. బెడ్ షీట్లలో బ్యాక్టీరియాను ఫార్మ్ చేస్తాయి. ఇది ఊపిరితిత్తుల సమస్యలు, అలర్జీలు లాంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి.
ఇది కూడా చదవండి: Green Chillies: భోజనంతో పాటు పచ్చిమిర్చి తింటే ప్రయోజనమా?