Bone Soup: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం మనం అనేక ఆహారాలను తీసుకుంటాం. వీటిలో బోన్ సూప్ ముఖ్యమైనది. బోన్ సూప్ శరీరానికి అనేక పోషకాలు అందిస్తుంది.
Also Read : బ్రెయిన్ స్ట్రోక్.. వీటిని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు!
బాగా ఉడికించి తయారుచేసిన బోన్ సూప్‌లో గ్లైసీన్, ఆర్జినీన్, ప్రోలీన్, విటమిన్స్, మినరల్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కణజాల నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి. బోన్ సూప్‌లోని కొల్లాజెన్ ప్రోటీన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ముఖ్యంగా చలికాలంలో చర్మం పగలకుండా ఉండడానికి ఎంతగానో సహాయపడుతుంది.
Also Read : ఎలుగుబంటిని రక్షించిన భారత సైన్యం
ఇమ్యూనిటీకి బోన్ సూప్..
అలాగే, బోన్ సూప్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా ఇంకా దృఢంగా ఉంచుతుంది. బోన్ సూప్‌లోని గ్లైసీన్ కండరాలకు శక్తిని ఇచ్చి, ఇమ్యూనిటీ పెంచడానికి కూడా సహాయపడుతుంది.
Also Read : శీతాకాలంలో ఈ పండు తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు!
కాబట్టి, చలికాలంలో బోన్ సూప్‌ను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం.
Also Read : వీర్యంతో ముఖ సౌందర్యం.. సెలబ్రిటీల సీక్రెట్ ఇదేనా!