Food & foodies: పిల్లలు వదలకుండా తినేసే స్పైసీ తందూరి శాండ్విచ్ రెసిపీ

వారాంతపు అల్పాహారం పిల్లలు ఇష్టపడేలా ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండాలి. బ్రేక్‌ఫాస్ట్‌ను అస్సలు మానకూడ స్పైసీ టండూరీ శాండ్‌విచ్ సులభంగా తయారు చేసి పిల్లలను సర్‌ప్రైజ్ చేయవచ్చు. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.

New Update
Spicy Tandoori Sandwich

Spicy Tandoori Sandwich

స్పైసీ తందూరీ శాండ్‌విచ్ రుచిని, ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది. ఇది భారతీయ రుచుల గొప్పతనాన్ని.. ఒక క్లాసిక్ శాండ్‌విచ్ సౌలభ్యంతో కలిపే అద్భుతమైన ఫ్యూజన్. మసాలాలు కలిపిన, పొగ వాసన వచ్చే తందూరీ చికెన్, క్రీమీ సాస్‌లు, తాజా కూరగాయలతో నిండిన ఈ శాండ్‌విచ్ ప్రతి ముద్దలోనూ కమ్మదనం మరియు కారం కలయికను అందిస్తుంది. అల్పాహారం, లంచ్ లేదా సాయంత్రం స్నాక్ కోసం ఈ శాండ్‌విచ్ అసాధారణమైన అనుభూతినిస్తుంది. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు.. ఒక మసాలాభరితమైన మరియు సంతృప్తికరమైన రుచిని ఇస్తుంది. అయితే వారాంతపు అల్పాహారం (Weekend Breakfast) ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు ఇష్టపడేలా ఉండాలి. బ్రేక్‌ఫాస్ట్‌ను అస్సలు మానకూడదు. ఈ వారాంతంలో స్పైసీ టండూరీ శాండ్‌విచ్ సులభంగా తయారు చేసి పిల్లలను సర్‌ప్రైజ్ చేయవచ్చు. ఇది తయారు చేయడం చాలా తేలిక. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. గ్రిల్ చేసి దీనిని టీతో లేదా గ్రీన్ చట్నీతో తింటే రుచి రెట్టింపు అవుతుంది. వీకెండ్‌లో స్పైసీ బ్రేక్‌ఫాస్ట్.. టేస్టీ తండూరీ శాండ్‌విచ్ రెసిపీని ఎలా సింపుల్‌ చేయాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

ఈ స్పైసీ తండూరీ శాండ్‌విచ్ కోసం పనీర్ ముక్కలు, చిక్కటి పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, మీకు నచ్చిన మసాలాలు, చాట్ మసాలా, నిమ్మరసం, ఉప్పు, నూనె, బ్రెడ్, వెన్న లేదా ఆలివ్ ఆయిల్, ఉల్లిపాయ, క్యాప్సికమ్, గ్రీన్ చట్నీ, క్యాబేజీ వంటివి అవసరం. ముందుగా ఒక గిన్నెలో పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో పనీర్ ముక్కలు వేసి 30 నిమిషాలు నానబెట్టాలి. తరువాత ఒక పాన్‌లో నూనె వేడి చేసి మ్యారినేట్ చేసిన పనీర్ మిశ్రమాన్ని వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. 

ఇది కూడా చదవండి: ముఖం మిలమిలా మెరవాలా..? అయితే ఇవి ట్రై చేయండి

ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్‌పై వెన్న రాయాలి. ఆపై దానిపై గ్రీన్ చట్నీ, మయోనైస్ లేదా పెరుగు, వేయించిన పనీర్ ఫిల్లింగ్, ఉల్లిపాయలు, క్యాప్సికమ్‌ ముక్కలు వేయాలి. పైన మరో బ్రెడ్ స్లైస్‌తో మూసివేయాలి. దీనిని శాండ్‌విచ్ మేకర్‌లో లేదా పెనంపై బంగారు రంగు, క్రిస్పీగా మారే వరకు గ్రిల్ చేయాలి. అంతే వేడివేడిగా ఉండే మీ స్పైసీ తండూరీ శాండ్‌విచ్ సిద్ధం. దీనిని టమాటా కెచప్ లేదా గ్రీన్ చట్నీతో సులభంగా తినవచ్చు.  

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: కళ్ళు మసకబారుతున్నాయా?.. పట్టించుకోకుండా ఉంటే కల్లుపోతాయి!!

Advertisment
తాజా కథనాలు