Health Tips: ప్రతి ఒక్కరూ 40 ఏళ్ల లోపు ఈ 20 పనులు చేయాలి

నలభై సంవత్సరాల వయసు అంటే దాదాపు సగం ఆరోగ్యకర జీవితం గడిచినట్లే. 1990కి అటూ ఇటూగా పుట్టిన వాళ్ల వాళ్ల వయసు 30 ఏళ్లకు దగ్గర పడ్డట్లే. రాబోయే పదేళ్లలో మీ జీవితంలో మీరు తప్పకుండా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
work

work

work: నలభై సంవత్సరాల వయసు అంటే దాదాపు సగం ఆరోగ్యకర జీవితం గడిచినట్లే. ఆ వయసు తర్వాత కొన్ని పనులు చేయాలన్నా చేయలేరు. అందుకే మీకు నలభై ఏళ్లు వచ్చేలోపు మీరు తప్పకుండా కొన్ని పనులు చేయాలి. 1990కి అటూ ఇటూగా పుట్టిన వాళ్ల వాళ్ల వయసు 30 ఏళ్లకు దగ్గర పడ్డట్లే. రాబోయే పదేళ్లలో మీ జీవితంలో మీరు తప్పకుండా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

40 ఏళ్లలోపు చేయాల్సిన పనులు:

నలభై దాటేలోపు మీకు ఏ రకమైన అప్పులు లేకుండా అన్నింటి నుంచి బయటపడండి. రిటైర్‌మెంట్ తర్వాత జీవితం కోసం కూడా ఇప్పటినుంచే డబ్బు ఆదా చేయడం మొదలుపెట్టండి. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ప్లానింగ్ పక్కాగా వేయండి. మీ భాగస్వామి మీద ప్రతి పనికీ ఆధారపడకండి. ఒక్కసారైనా క్రూజ్‌లో, విమానంలో ప్రయాణం చేయండి. ట్రెక్కింగ్ చేసి మాత్రమే చూడగల ప్రదేశాలు, పుణ్య క్షేత్రాలుంటే ఇప్పుడే చూడ్డానికి ప్లానింగ్ వేసుకోండి.ఇల్లు కొనుక్కోండి. చిన్నదో పెద్దదో మీకంటూ ఓ సొంతిళ్లు ఉండాలి. ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థలో చేరండి.

ఇది కూడా చదవండి:  ఐదో రోజు అట్ల బతుకమ్మ..విశిష్ఠతలు ఇవే!

వారానికో, నెలకో ఒక్క రోజైనా మీ సేవలు అందించండి. పిల్లల ప్రేమలో పడి భాగస్వామి ప్రేమను నిర్లక్ష్యం చేయకండి. మీ జీవిత భాగస్వామికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి. సమయం ఉన్నప్పుడు మీ భాగస్వామికి పూర్తిగా విశ్రాంతి ఇచ్చి కుటుంబ వ్యవహారాలు, ఇంటి పనులు, వంట, సామాన్లు కొనడం లాంటివి మీరే చేయండి. నెలకో చిన్న ట్రిప్, సంవత్సరానికి కాస్త దూర ప్రదేశాలకు వెళ్లడానికి ప్లానింగ్ వేసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే తక్షణమే తీసుకోండి. వైద్యుల సలహా మేరకు సంవత్సరానికి ఒకసారైనా పూర్తి వైద్య పరీక్షలు చేయించుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలవాటు చేసుకోండి. వాకింగ్, యోగా లాంటివి మీ జీవితంలో భాగం చేసుకోండి. ఇలా చేస్తే మీ రిటైర్‌మెంట్‌ జీవితం ఆనందంగా గడపవచ్చని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మావోయిస్టులు వర్సెస్ పోలీసులు..! ఎర్రదండు కదులుతుందా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు