Health Tips: రాగులను ఆఫ్రికా, ఆసియాలోని మెట్టప్రాంతాలలో ఎక్కువగా పండిస్తారు. దీనిని వార్షిక ధాన్యపు పంట అని అంటారు. రాగుల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అందుకే దీనిని తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతారు. అయితే శరీరంలోని ఇన్సులిన్ నిరోధకతను తగ్గించటంతోపాటు షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో రాగులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యానికి గురైనవారు రాగి జావ, గంజి, జావ వంటివి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉత్పత్తి చెస్తుంది.
రాగుల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు, ఐరన్, కాల్షియం, ప్రొటీన్లు, క్యాలరీలు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌లు, విటమిన్ సి, ఇ, బి-కాంప్లెక్స్ విటమిన్లు అధికంగా ఉన్నాయి. పాలిచ్చే తల్లులు ప్రతిరోజూ రాగుల పొడిని అన్నంలో కలిపి తింటే మంచిది. రాగులు క్యాన్సర్ సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. నిద్ర సమస్యతో బాధ పడేవారు ప్రతిరోజూ రాగిజావ తాగితే మంచి ఆరోగ్యంతోపాటు నిద్ర పడుతుందట. అయితే మొలకెత్తించిన రాగులు, కూరగాయలతో చేసిన ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది. ఇది శరీరానికి మరిన్ని పోషకాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కావాల్సిన పదార్థాలు..
- పెరుగు, బియ్యం పిండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కప్పు రాగులు, కొత్తిమీర, టమాటా, తగినంత ఉప్పు అన్ని సిద్ధం చేసుకోవాలి.
రాగుల ఊతప్పం తయారీ విధానం:
- రాగులను నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత రాగులను 5 గంటలు నీళ్లలోనానబెట్టి ఏదైనా గుడ్డలో వీటిని ముట కట్టాలి. ఆరేడు గంటల తర్వాత రాగులు మొలకెత్తుతాయి. ఇప్పుడు మొలకొచ్చిన రాగుల్ని, పచ్చిమిర్చి, పెరుగు వేసి మిక్స్ పట్టాలి. అందులో బియ్యం పిండి కలిపి 5 గంటల వరకు పులియబెట్టాలి. గ్యాస్‌పై పెనం పెట్టి నూనె కొద్దీగా వేసి గరిటతో పిండిని కాస్త మందంగా వేయాలి. వాటిమీద ఉల్లిపాయ, టమాటా ముక్కలు, కొత్తిమీర వేయాలి. నూనెకు బదులు బటర్ వేసి ఊతప్పాన్ని రెండు వైపులా రంగు మారే వరకు కాల్చాలి. దీనిని సాస్, చట్నీతో వేడివేడిగా తింటే రుచి సూపర్‌గా ఉంటుంది. అంతేకాదు మళ్లీ మళ్లీ ఈ ఊతప్పం తినాలనే కోరిక పుడుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.