Plastic Packed: ఈ ఆహారం తింటే రొమ్ము క్యాన్సర్‌ గ్యారంటీ

ప్లాస్టిక్, కార్డు బోర్డు వంటి వాటిలో ఆహారం తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌ వస్తుంది. ఓ నివేదిక ప్రకారం.. ఈ ప్లాస్టిక్ టేబుల్ వేర్లలో 200 రసాయనాలు కలుస్తాయట. అందుకనే ప్లాస్టిక్‌లో ఆహారం తీసుకోవడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు.

New Update
breast cancer

breast cancer

Plastic Packed Food: ప్రస్తుత కాలంలో ఆహార పదార్థాలు అన్ని ప్లాస్టిక్‌తోనే ప్యాక్‌ చేసి వస్తున్నాయి. ప్యాకింగ్ మొత్తం ప్లాస్టిక్‌తోనే చేస్తుంటారు. అయితే ఈ అలవాటు మిమ్మల్ని తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుంది. పరిశోధన ప్రకారం ప్లాస్టిక్, కార్డు బోర్డు వంటి వాటితో ఆహారం తీసుకుంటే ఎంతో అనారోగ్యం అని తేలింది. ఈ రోజుల్లో మనం తినే ప్రతి వస్తువు 80% ప్లాస్టిక్ ప్యాకింగ్‌తోనే వస్తుంది. చిన్నపిల్లల స్నాక్స్‌ దగ్గర నుంచి పాల ప్యాకెట్లు, బ్రెడ్‌ ప్యాకెట్స్‌ మొత్తం ప్లాస్టిక్‌ కవర్లలోనే వస్తున్నాయి. వీటిని తినడం వల్ల ఎంతో అనారోగ్యమని నిపుణులు అంటున్నారు.

రొమ్ము క్యాన్సర్‌ వ్యాధి వస్తుంది:

నివేదిక ప్రకారం.. ఈ ప్లాస్టిక్ టేబుల్ వేర్లలో 200 రసాయనాలు కలుస్తున్నాయి. ఇది రొమ్ము క్యాన్సర్‌ను పెంచుతుంది. అందుకనే ప్లాస్టిక్‌లో ఆహారం తీసుకోవడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లాస్టిక్‌లో 76 రకాల హానికరమైన పదార్థాలను నిపుణులు గుర్తించారు. ఇది అనేక వ్యాధులను కలుగజేస్తుందని అంటున్నారు. ప్యాక్ చేసిన ఆహారం తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: పెరుగు ఎక్కువగా తిన్నా ప్రమాదమేనా?

ఈ ప్యాకింగ్ వస్తువులలో పీఎఫ్ఏ పాలేట్లు ఉంటాయి. ఇవి సులభంగా విచ్ఛిన్నం కావు. వాటిని తినడం వల్ల కడుపులో రసాయనాలు పేరుకుపోతాయి దీనివల్ల రొమ్ము క్యాన్సర్ అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీ జీవితంలో రసాయనాలను తగ్గించడం వల్ల క్యాన్సర్‌తో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఇప్పటివరకు 76 అనుమానిత క్యాన్సర్ కారకాలను నిపుణులు గుర్తించారు. ఇవి రొమ్ము క్యాన్సర్‌కు ప్రధాన కారణమని చెబుతున్నారు. అందుకే ప్లాస్టిక్‌తో ప్యాక్ చేసిన వస్తువులను తినకూడదని సలహా ఇస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి:  మన శరీరంలో మనకు తెలియని రహస్యాలు

 

 

ఇది కూడా చదవండి: ఇక్కడ ప్రజలు రాత్రి పూట మాత్రమే బయటికి వస్తారు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు