Fish: చేపలు తింటే ఐదు వ్యాధులకు చెక్‌.. అవేంటో తెలుసా..?

చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. చేపలు ఎక్కువగా తింటే మెదడు, ఒత్తిడి, గుండె జబ్బులు, ఆస్తమా, దృష్టిలోపం వంటి సమస్యలు తగ్గుతాయి. గర్భధారణ సమయంలో చేపలు తింటే శిశువు మెదడు వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు.

Fish

Fish

New Update

Fish: చేపల్లో అనేక పోషకాలు ఉంటాయి. ప్రపంచంలోని ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా వీటిని పరిగణిస్తారు. నాణ్యమైన ప్రొటీన్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-డి, విటమిన్-బి2, ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా చేపల్లో పుష్కలంగా లభిస్తాయి. అందుకే చేపలు తినే వారు తెలివైనవారని అంటారు. చేపలు తినడం గుండె ఆరోగ్యానికి మంచిది. డిప్రెషన్, టైప్-1 డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతుంది. చేపలను వారానికి రెండుసార్లు తినాలి. చేపలు తింటే ఎలాంటి వ్యాధులు తగ్గుతాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మెదడుకు ప్రయోజనకరం:

  • పరిశోధన ప్రకారం.. చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి మెదడుకు మేలు చేస్తాయి. అలాగే మానవ మెదడులో కనిపించే పొర n-3 FAలకు చేపలు చాలా మంచివిగా పరిగణించబడతాయి. అంతేకాదు వృద్ధులలో డిమెన్షియా వంటి మతిమరుపును చేపలు నివారిస్తాయి. గర్భధారణ సమయంలో చేపలు తినడం మంచిదని, ఇది శిశువు మెదడును పదునుపెడుతుందని అధ్యయనం చెబుతోంది.

ఇది కూడా చదవండి:  కాఫీ తాగితే గుండె జబ్బులు రావా.. ఇందులో నిజమెంత..?

ఒత్తిడి నుంచి ఉపశమనం:

  • చేపలు తినడం వల్ల శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రోజూ చేపలు తినేవారికి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి వ్యాధులు రావని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడి, ఆందోళన, టెన్షన్‌ ఉండదని నిపుణులు అంటున్నారు.

గుండె జబ్బులకు మంచిది:

  • చేప గుండె జబ్బులకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు బలాన్నిస్తాయి. ఒమేగా-3 ట్రైగ్లిజరైడ్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పిల్లలు కూరగాయలు తినడం లేదా.. ఇలా చేయండి

ఆస్తమా నివారణ:

  • చేపలలో లభించే N-3 నూనె ఆస్తమా ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉబ్బసంతో పాటు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, అంటే COPD, అతిసారం, చర్మ అలెర్జీలు వంటి ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధులకు చేపలు ప్రయోజనకరంగా ఉంటాయి.

దృష్టికి మేలు చేస్తుంది: తెలంగాణ ప్రతీక బతుకమ్మ విశిష్ఠత తెలుసా..?

ఇది కూడా చదవండి: 

  • నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చేపలలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కంటి రెటీనాకు రెండు రకాల ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అవసరం ఈ రెండు కొవ్వు ఆమ్లాలు సాల్మన్, ట్యూనా, ట్రౌట్ వంటి చేపలలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ కషాయం ట్రై చేయండి.. పీరియడ్స్ సమస్య పరార్‌

#fish
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe