health tips: ఈ కషాయం ట్రై చేయండి.. పీరియడ్స్ సమస్య పరార్‌

ప్రస్తుతం అనేక మంది మహిళలు ఇర్రెగ్యులర్ పిరియడ్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే.. కొన్ని కషాయాలు తాగితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
Periods

Health Tips:  ప్రస్తుత కాలంలో జీవనశైలి, ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. దీనివలన అనే అనారోగ్య సమస్యలతో పాటు హార్మోన్ల లోపాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ హార్మోన్ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు మహిళలు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే వీటిల్లో ప్రధానంగా మహిళలకు ప్రతినెలా పీరియడ్ప్‌ సమస్యలు ఉంటాయి. అయితే పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంతేకాదు డాక్టర్ దగ్గరకు వెళ్లి వేలకొద్దీ మెడిసిన్ వాడుతారు. అయితే ఎక్కువ మందులు వాడటం వలన అనేక ఇతర సైడ్ ఎఫెక్ట్స్‌లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని పిరియడ్స్ సమయానికి రావాలంటే ఇంట్లోనే ఓ డ్రింక్‌ని తయారు చేసుకొని తాగితే ఆరోగ్యంతో పాటు ఈ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. అయితే ఎక్కువగా ఆడవారిలో హార్మోన్ల మార్పువల్ల ఒత్తిడి, ఉబ్బకాయం, థైరాయిడ్ గర్భనిరోధక, పీసీఓడీ వండి సమస్యల కారణంగా పిరియడ్స్ రావు. అందుకని ఇంట్లో చేసుకొని కషాయాల వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ కషాయ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కషాయాన్నికి కావాల్సిన పదార్థాలు:

  • పసుపు
  • నీరు
  • అల్లం
  • దాసించెక్క
  • జీలకర్ర
  • అజ్వానా
  • ఇంగువ
  • బెల్లం

ముందుగా ఓ గిన్నిలో రెండు కప్పుల నీరు పోసి అందులో బెల్లం, అల్లం, అజ్వానా, ఇంగువ, జీలకర్ర, పసుపు, చక్కా వేసి కలపాలి. ఈ పదార్థాలన్నింటిని 15 నిమిషాల చిన్న మంట మీద కప్పు కషాయం వచ్చే వరకు మరిగించాలి.  తర్వాత స్ట్‌వౌ ఆఫ్‌ చేసి దీనిని వడకట్టి గ్లాస్‌లో ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ఆనోగ్యానికి, పీరియడ్స్‌ సమస్యకి మంచిది. అంతేకాదు ఇలా 2,3 రోజులు తాగితే పీరియడ్స్‌ సమయానికి వస్తాయి. పీసీఓఎస్‌, పీసీఓడీ, సక్రమంగా రుతక్రమం లేని ఆడవారు దీన్ని తాగవచ్చు. అంతేకాదు.. పీరియడ్స్‌ టైంలో కడుపు నొప్పి సమస్య ఉంటే ఈ డ్రింక్ తాగితే బాగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు