జంక్ ఫుడ్ తింటున్నారా.. మీ గుండె ప్రమాదంలో ఉన్నట్లే!

అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే జ్ఞాపకశక్తి కోల్పోవడంతో పాటు స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఆలోచనా సామర్థ్యం తగ్గిపోవడం, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Junk Food
New Update

Side Effects: ప్రస్తుత కాలంలో అంతా జంక్‌ ఫుడ్‌ మయమైపోయింది. పిజ్జా, బర్గర్స్, ఫ్రైస్, ప్యాక్డ్ చిప్స్, రెడ్ మీట్, బేకన్, హాట్ డాగ్‌లు, సాసేజ్‌లు వంటి జంక్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే వారికి జ్ఞాపకశక్తి కోల్పోవడం, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆహారం ఎక్కువగా తినే వ్యక్తుల జ్ఞాపకశక్తిపై తీవ్రంగా ప్రభావం పడుతుందట. ఓ అధ్యయనంలో చేసిన పరిశోధన ప్రకారం.. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ జ్ఞాపకశక్తి కోల్పోవడం, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని కనుగొన్నారు. జంక్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినేవారిలో డిమెన్షియా ప్రమాదం తీవ్రంగా ఉంటుందట. దీనిలో జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం తగ్గుతుంది. వారిలో స్ట్రోక్ ముప్పు చాలా ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. జంక్‌ ఫుడ్స్‌తో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

  • ఓ పరిశోధనలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినే వ్యక్తులు డిమెన్షియా బారిన పడే ప్రమాదం ఉందని వెల్లడైంది. దీనిలో జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం చెడుగా ప్రభావితమవుతాయని తెలిపారు. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ దుష్ప్రభావాలతోపాటు ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహానికి జంక్ ఫుడ్ కారణమని పరిశోధకులు కనుగొన్నారు. అయితే.. కొత్త అధ్యయనంలో ఇది జ్ఞాపకశక్తికి అనుసంధానించబడిందని చెబుతున్నారు

మానసిక ఆరోగ్యంపై ప్రభావితం:

  • జంక్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మెదడుపై చెడు ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. దీనిపై ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది. ఈ పరిశోధన అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం, కాగ్నిటివ్ క్షీణత, స్ట్రోక్ ప్రమాదం మధ్య సంబంధాన్ని నిరూపించ లేదట. అయితే ఇది వయస్సులో మెదడు, ఆరోగ్యంలో ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతను సూచిస్తుందని చెబుతున్నారు.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే..

  • అతిగా ప్రాసెస్ చేయబడిన ఆహాలు. రుచిని మెరుగుపరచడానికి సంకలితాలను కలిగి ఉన్న ఆహారాలను అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. అవి ఫైబర్, విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ తక్కువగా, చక్కెర, సోడియం, సంతృప్త కొవ్వుతో నిండి ఉంటాయి. పొటాటో చిప్స్, సోడా, ఎనర్జీ డ్రింక్స్, బేకన్, సాసేజ్, చికెన్ నగ్గెట్స్, ఇన్‌స్టంట్ సూప్ మిక్స్, కెచప్ వంటి వాటిని ఇందులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#junk-food
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe