/rtv/media/media_files/2025/07/14/early-morning-tips-2025-07-14-09-15-30.jpg)
Early Morning Tips
ఉదయం లేచిన వెంటనే కొన్ని పనులు చేయడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారని నిపుణులు అంటున్నారు. డే అంతా కూడా హ్యాపీగా గడవాలంటే తెలిసో తెలియక ఉదయం పూట కొన్ని మిస్టేక్స్ చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మార్నింగ్ ఎలాంటి పనులు చేయడం వల్ల డే అంతా సాఫీగా సాగుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
త్వరగా నిద్రలేవాలి
ఉదయం పూట త్వరగా నిద్రలేవడం వల్ల యాక్టివ్‌గా ఉంటారు. అసలు బద్దకం, చిరాకు వంటివి కూడా ఉండవు. అలాగే ఉదయం తొందరగా లేవడం వల్ల ఎక్కువ టైమ్ ఉన్నట్లు అనిపిస్తుంది. అన్ని పనులు నిదానంగా, ప్రశాంతంగా చేసుకోవచ్చు. అదే ఆలస్యంగా లేస్తే మాత్రం చిరాకుగా ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లో కూడా లేటుగా అసలు లేవవద్దని నిపుణులు అంటున్నారు.
మొబైల్ చూడవద్దు
లేచిన వెంటనే మొబైల్, టీవీ వంటివి అసలు చూడవద్దు. దీనివల్ల మీరు మళ్లీ బీజీగా అవుతారు. అలాగే ఆ మొబైల్ నుంచి వచ్చే కిరణాల వల్ల కొంత వరకు మీ కళ్లకు, మైండ్‌కు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి కొన్ని నిమిషాల వరకు అసలు మొబైల్ జోలికి పోవద్దు.
ధ్యానం చేయండి
 ఉదయం నిద్ర లేవగానే ధ్యానం చేయడం మంచిదని నిపుణులు తెలిపారు. సమయం ఉంటే 30 నుంచి 40 నిమిషాల వరకు.. లేకపోతే ఒక 5 నిమిషాలు అయినా ధ్యానం చేయాలని నిపుణులు వెల్లడించారు. దీనివల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట లేచిన వెంటనే కొన్ని నిమిషాల ధ్యానం రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుందని అంటున్నారు. 
నడక
ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. జీవక్రియ పెరుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా క్లియర్ అవుతాయని, మానసికంగా ప్రశాంతంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
నీరు త్రాగాలి
ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ, టీ వంటివి కాకుండా గోరు వెచ్చని నీరు తాగడం ముఖ్యం. ఎందుకంటే దీనివల్ల బాడీలోని విష పదార్థాలు అన్ని బయటకు రావడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే చర్మం కూడా మెరిసిపోతుందని చెబుతున్నారు.
గ్రీన్ టీ
లేచిన వెంటనే వేడి నీరు లేదా గ్రీన్ టీ తీసుకున్న ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల స్కిన్ గ్లో వస్తుందని నిపుణులు అంటున్నారు.
అల్పాహారం
ఉదయం లేచిన కొన్ని నిమిషాలకే టిఫిన్ చేయాలి. అసలు టిఫిన్‌ను స్కిప్ చేయకూడదు. దీనివల్ల అల్సర్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. 
చల్లటి నీటితో స్నానం
చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చల్లటి నీటిని తట్టుకోలేని వారు కాస్త గోరువెచ్చగా ఉన్న వేడి నీటితో స్నానం చేయవచ్చు. దీనివల్ల రిలాక్స్‌గా ఉంటారని నిపుణులు అంటున్నారు.
కంగారుపడకుండా
కొందరు ఆఫీసు లేదా స్కూల్‌కు వెళ్లేటప్పుడు తొందరగా కంగారుపడి వెళ్తుంటారు. కానీ ఇలా కాకుండా నెమ్మదిగా వెళ్లడం వల్ల మీకు ఆందోళన ఉండదు. డైలీ ఒక పది నిమిషాల ముందే బయలు దేరడం స్టార్ట్ చేయాలని నిపుణులు అంటున్నారు. 
కోపానికి గురి కావద్దు
ఉదయాన్నే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుని కోపానికి గురి కావద్దు. దీనివల్ల ఈ కోపం, చిరాకు రోజంతా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
 Follow Us
 Follow Us