ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు తింటున్నారా.. అయితే ఆరోగ్యం డేంజర్‌లో పడినట్లే!

ఉదయం పూట ఖాళీ కడుపుతో కెఫిన్, చక్కెర ఉండే పదార్థాలు, పానీయాలు, నూనెలో వేయించిన ఫుడ్, సిట్రస్ పండ్లు వంటివి తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైలీ వీటిని పరిగడుపున తినడం వల్ల ఆరోగ్యం డేంజర్‌లో పడుతుందన్నారు. 

New Update
Coffee Health Benefits: కుదిరితే రోజూ ఓ కప్పు కాఫీ.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ మాఫీ..!!

మనం తినే ఆహార అలవాట్లే ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. పోషకాలు ఉండే ఆహారాన్ని ఉదయాన్నే తినడం వల్ల రోజంతా ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉంటారు. కానీ చాలామంది ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎట్టి పరిస్థితులో కూడా ఈ నాలుగు రకాల ఆహార పదార్థాలను అసలు ఖాళీ కడుపుతో తీసుకోవద్దు. 

కెఫిన్ పదార్థాలు
ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగకపోతే కొందరికి రోజు గడవదు. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇందులోని కెఫిన్ కడుపులో యాసిడ్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు గుండెల్లో మంట వంటి సమస్యలను ప్రేరేపిస్తుంది. 

చక్కెర ఉండే పదార్థాలు, పానీయాలు
స్వీట్లు, చక్కెర ఉండే పదార్థాలు, పానీయాలను ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. చక్కెర ఉన్న వాటిని ఉదయాన్నే తినడం వల్ల రోజంతా నీరసంగా అనిపిస్తుంది. 

నూనెలో వేయించిన ఫుడ్
నూనెలో బాగా వేయించిన పదార్థాలు లేదా స్పైడీ ఫుడ్ ఉదయం పూట తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సిట్రస్ పండ్లు
సిట్రిక్ ఆమ్లం ఉండే ఆరెంజ్ పండ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. ఆహారం ఏదైనా తిన్న తర్వాత సిట్రిక్ ఆమ్లం ఉన్న పండ్లు తినవచ్చు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు