రోజంతా యాక్టివ్‌గా ఉండటంతో పాటు బలంగా ఉండాలంటే ఉదయం పూట అల్పాహారం చాలా ముఖ్యం. ఉదయం పూట తీసుకునే ఫుడ్స్ వల్లే రోజంతా ఆరోగ్యంగా ఉంటారా? లేదా? అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. అయితే రోజంతా యాక్టీవ్‌గా ఉండాలంటే ఉదయం పూట తప్పకుండా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాలి. మరి ఆ ఫుడ్స్ ఏంటో చూద్దాం.
ఇది కూడా చూడండి: గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కారణమేంటంటే?
దానిమ్మ
దానిమ్మ పండులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఉదయం సమయాల్లో ఈ పండు తింటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. దానిమ్మలో కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి, రక్తం ఎక్కడానికి దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు తినకపోయే వారు జ్యూస్ చేసి కూడా తాగవచ్చు.
ఇది కూడా చూడండి: బాణసంచా తయారీపై పిడుగు.. ఇద్దరు మృతి
డ్రైఫూట్స్
ఖర్జూరం, ఎండుద్రాక్ష, వాల్‌నట్స్, బాదం వంటి డ్రైఫ్రూట్స్‌ను ఉదయం తింటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. మైక్రో మినరల్స్, న్యూట్రియెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. పీసీఎఎస్, పీసీఓడీ, థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడే మహిళల్లో హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.
ఇది కూడా చూడండి: అయోధ్యలో దీపోత్సవం.. రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు
నిమ్మరసం
ఉదయం పూట నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి తక్షణమే ఎనర్జీ వస్తుంది. ఇందులో ఉండే విటమిన్-సి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అలాగే జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల బరువును నియంత్రణలో ఉంచుతాయి. అలాగే చర్మాన్ని తాజాగా, యవ్వనంగా కూడా ఉంచుతాయి. అలాగే ఇందులో కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు యాంటీసెప్టిక్‌గా పనిచేస్తాయి. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ కడుపులోని చెడు క్రిములను నాశనం చేసి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ఇది కూడా చూడండి: USA:అమెరికాలో మహిళలకు పదవి ఇవ్వరా? అక్కడ కూడా వివక్షేనా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.